కంటైన్మెంట్ జోన్ గా రాజ్ భవన్, గవర్నర్ కి కూడా కరోనా పరీక్షలు...

By Sree sFirst Published May 28, 2020, 2:11 PM IST
Highlights

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూ అక్కడ ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ వ్యాపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్ భవన్ లో ఏకంగా 6గురు కరోనా పాజిటివ్ గా తేలారు. రాజ్ భవన్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కుటుంబాల వ్యక్తులకు ఈ వైరస్ సోకింది. 

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూ అక్కడ ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ వ్యాపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్ భవన్ లో ఏకంగా 6గురు కరోనా పాజిటివ్ గా తేలారు. రాజ్ భవన్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కుటుంబాల వ్యక్తులకు ఈ వైరస్ సోకింది. 

రెండు రోజుల క్రితం రాజ్ భవన్ లో క్లీనర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి కుమారుడికి కరోనా సోకడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆతరువాత అధికారులు అతడి కుటుంబసభ్యులను టెస్ట్ చేయగా అందరూ కరోనా పాజిటివ్ గా తేలారు.  వీరితోపాటుగా రాజ్ భవన్ లోని మరో ఉద్యోగి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో వీరి సంఖ్యా 6కు చేరింది. అందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇలా కేసులు సంఖ్య పెరగడంతో రాజ్ భవన్ ప్రాంతం  చేసిన అధికారులు క్వార్టర్స్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఉద్యోగులందరినీ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ కి కూడా కరోనా టెస్టు నిర్వహించారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యా లక్షా 50 వేలను దాటింది. గురువారం ఉదయం 8గంటల సమయానికి  1,58,333 కేసులు నమోదైనట్టు నేటి ఉదయం వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య శాఖ డేటా ద్వారా తెలియవస్తుంది. 

గత 24 గంటల్లో 5వేలకు పైగా కేసులు నమోదయినట్టు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 67,692మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,531 మంది మరణించారని తెలియవస్తుంది.  ఒక్కరోజే  మంది 194 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 86,110 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఝార్ఖండ్ లో నిన్న ఒక్కరోజే 32 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.,దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 458కి చేరుకుంది.

కాకపోతే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే... రికవరీ రేట్. మార్చ్ లో 7.1 శాతంగా రికవరీ రేట్ ఉండగా అది నేడు 42.75 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ మరణాల్లో కూడా గతంలో 3.3 శాతంగా ఉండగా అది  2.87 గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

click me!