మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా 100 మందిని క్వారంటైన్ కు తరలించారు. వధువు బంధువుకు కరోనా సోకిందని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా 100 మందిని క్వారంటైన్ కు తరలించారు. వధువు బంధువుకు కరోనా సోకిందని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే వధూవరులతో పాటు రెండు కుటుంబాలకు చెందిన వంద మందిని క్వారంటైన్ కు తరలించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో వధువు బంధువు విధులు నిర్వహిస్తున్నాడు. గత వారం ఆయన ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న తన ఇంటికి వెళ్లారు.
undefined
also read:కరోనా క్వారంటైన్ సెంటర్ లో పెళ్లి.. ఒక్కటైన ప్రేమ జంట
ఈ క్రమంలో అతను జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అనుమతించారు. ఇంటికి వచ్చాక అతను ఇతర ప్రాంతాల్లోని కొందరు బంధువులను కలిశారు. అలాగే మే 26న ఛింద్వారాలో జరిగిన తన మరదలి పెళ్లికి హాజరయ్యారు.
సీఐఎస్ఎఫ్ లో పనిచేసే అతడికి కరోనా లక్షణాలు కన్పించడంతో వైద్యులు పరీక్షించారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా సోకిందని తేలింది. దీంతో వధూవరులకు చెందిన వంద మందిని మూడు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
also read:తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలియక, తల్లిని లేపుతూ చిన్నారి: వీడియో వైరల్
కరోనా లక్షణాలు ఉన్నప్పటికి అలాగే తిరగడంతో మరికొందరికి కరోనా వచ్చే అవకాశం ఉంది. సీఐఎస్ఎఫ్ లో పనిచేసే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు.
ఇదిలా ఉంటే వారం క్రితం ఇదే తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. రైసిన్ జిల్లాలోని మణిదీప్ ప్రాంతంలో కొత్తగా పెళ్లైన యువతికి కరోనా సోకింది. దీంతో వరుడితో పాటు పూజారి వధూవరుల తరపున 32 మంది బంధువులను క్వారంటైన్ కు తరలించారు.