వాన‌కాలం ఎఫెక్ట్ : ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు !

Published : Jul 09, 2023, 02:53 PM IST
వాన‌కాలం ఎఫెక్ట్ : ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు !

సారాంశం

New Delhi: టమోటా ధరలు భ‌గ్గుమంటూ సామాన్యుల జేబులకు చిల్లు పెట్టడంతో పాటు ప్ర‌స్తుతం ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్న టమోటాలు వాటి ధరలపై ఒత్తిడి పెంచాయి. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విప‌రీతంగా పెరుగుతున్నాయి.  

Vegetables Prices: ఈ ఏడాది దేశంలోకి రుతుప‌వ‌నాలు ఆల‌స్యంగా ప్ర‌వేశించాయి. అయితే, ప్ర‌స్తుతం రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో ఇంకా వాన‌లు ప‌డ‌టం లేదు. ఆయా ప‌రిస్థితుల ప్ర‌భావం ఈ సీజ‌న్ సాగుపై క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉన్న పంట‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌టంతో కూర‌గాయ‌ల ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.  ప్ర‌స్తుతం వీధి వ్యాపారులు కిలో టమాటా రూ.130 నుంచి 200 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. బీన్స్ కిలో రూ.120, ఉల్లిపాయలు రూ.35, బంగాళాదుంపలు రూ.35, మిర్చి రూ.150, క్యారెట్ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు.

టమోటా ధరలు భ‌గ్గుమంటూ సామాన్యుల జేబులకు చిల్లు పెట్టడంతో పాటు ప్ర‌స్తుతం ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్న టమోటాలు వాటి ధరలపై ఒత్తిడి పెంచాయి. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విప‌రీతంగా పెరుగుతున్నాయి.

రుతుప‌వ‌నాల ప్రభావం చాలా న‌గ‌రాల్లో కూర‌గాయ‌ల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. ఐటీ న‌గ‌రం బెంగ‌ళూరులో డిమాండ్ పెరగడంతో టమాటా, అల్లం, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే వంకాయ, ఉల్లి, బంగాళాదుంప, క్యాప్సికమ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే, ప్రతి సంవత్సరం, వర్షాకాలం ప్రారంభంతో కూరగాయల ధరలు పెరుగుతాయి మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ఈ ఏడాది సాధారణం కంటే ధరలు అధికంగా పెరిగాయి. 

గత రెండేళ్లుగా ధరలు తగ్గుముఖం పట్టడమే టమోటా ధరలు పెరగడానికి కారణమని మాండ్యకు చెందిన టమోటా రైతు తెలిపారు. వడగాల్పులు, రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ ఏడాది కూరగాయల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కర్ణాటకలో రుతుపవనాలు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత పంట నష్టం జరిగే అవకాశం ఉందనీ, దీనివల్ల కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

బెంగ‌ళూరులో ఈ వారంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. 

టమాటా: రూ.110-180

బీన్స్: రూ.100-120

వంకాయ: రూ.40-60

పచ్చిమిర్చి: రూ.150-160

అల్లం: రూ.250-300

ఉల్లి: రూ.35-50

క్యాప్సికమ్: రూ.50-70

బంగాళాదుంప: రూ.35-40

ఆకుకూరల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో రూ.10 ఉన్న కొత్తిమీర కట్ట ఇప్పుడు రూ.40కి అమ్ముతున్నారు. పుదీనా ఆకులు, అమర్నాథ్, మెంతులు వంటి ఇతర ఆకుకూరలు కూడా ఖరీదైనవిగా మారాయి.

PREV
click me!

Recommended Stories

Baba Vanga : 3వ ప్రపంచ యుద్ధం.. భూమిపైకి గ్రహాంతరవాసులు.. 2026 లో బాబా వంగా షాక్ !
2025 సాధించిన విజయాలివే... 2026 ప్లాన్స్ కూడా రెడీ