రైల్వే ప్రయాణికులకు షాక్.. 62రైళ్లు రద్దు

By ramya neerukondaFirst Published Dec 28, 2018, 12:07 PM IST
Highlights

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. డిసెంబర్ 30వ తేదీన 62రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. డిసెంబర్ 30వ తేదీన 62రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొరుక్కుపేట - తిరువొత్తియూర్‌ మధ్య రైలు మార్గం ఏర్పాటు పనులు కొనసాగుతుండడంతో 30వ తేదీన ఈ మార్గాల్లో వెళ్లే 62 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. 

చెన్నై సెంట్రల్‌ నుంచి తెల్లవారు జామున 2.40 గుమ్మిడిపూండికి నడిపే సబర్బన్‌ రైలు 29, 30వ తేదీలలో రద్దుచేయబడింది. చెన్నై సెంట్రల్‌ నుంచి గుమ్మి డిపూండి, సూళ్లూరు పేట మధ్య నడుపుతున్న 31 సబర్బన్‌ రైళ్లు 30వ తేదీ ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రద్దుచేశారు.
సూళ్లూరు పేట - గుమ్మిడిపూండి నుంచి సెంట్రల్‌కు నడిపే 31 సబర్బన్‌ రైళ్లను కూడా రద్దుచేశారు. వచ్చే 30వ తేదీన చెన్నై సెంట్రల్‌ నుంచి గుమ్మిడిపూండి, సూళ్ళూరుపేట మార్గంలో 13 ప్రత్యేక రైళ్లనునడుపనున్నారు. 

మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌కు నడిపే పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దుచేశారు. సెంట్రల్‌కు బదులు గా గుమ్మిడిపూండి నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. పశ్చిమ రాష్ట్రం నుంచి చెన్నై సెంట్రల్‌కు న్యూజిలాపురి రైలును పాక్షికంగా రద్దుచేశారు. ఈ రైలు సెంట్రల్‌కు బదులు ఎన్నూర్‌కు వచ్చి చెనూరుతుంది. అలాగే నవజీవన్‌, హౌరా, హాల్డియా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పాక్షికంగా రద్దుచేశారు.

click me!