కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. జనవరి 18 వరకు పూర్తిగా ప్రార్థనా ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశాన్ని నిషేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా (corona) కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు దేశంలో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 12 రోజుల వరకు పది వేల లోపే కేసులు నమోదవుతుండగా ఇటీవల ఆ సంఖ్య బాగా పెరిగింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారీ మూడేళ్లుగా మనుషులను వదలడం లేదు. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్ అంటూ ఇలా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. ఓ సారి డెల్టా (delta) అని, మరో సారి ఒమిక్రాన్ (omicron) ఇలా తన రూపాలు మార్చుకుంటూ మనుషులను ఇబ్బంది పెడుతూనే ఉంది.
దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత నెలలో జరిగిన క్రిస్మస్ వేడుకలను, న్యూయర్ వేడుకలను రద్దు చేశాయి. అలాగే నైట్ కర్ఫ్యూ (night curfew), వీకెండ్ కర్ఫ్యూలను (weekend curfew) అమలు చేస్తున్నాయి. థియేటర్లు, (theaters) జిమ్ లను (gyms) 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించాలని సూచిస్తున్నాయి. ఢిల్లీలో అయితే ప్రైవేట్ ఆఫీసులన్నీ వర్క్ ఫ్రం హోం విధానంలో నిర్వహించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆదేశించింది. ఇలా వివిధ రాష్ట్రాలు స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా మరో కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.
undefined
తమిళనాడు (thamilnadu) రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రార్థనా స్థాలాల్లో ప్రజలకు ప్రవేశాన్ని నిషేదించింది. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 16న (ఆదివారం) రాష్ట్రం పూర్తి లాక్‌డౌన్‌ను పాటించనుంది. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రజా రవాణ వ్యవస్థలో 75 శాతం సీటింగ్ కెపాసిటీలో మాత్రమే ప్రయాణికులకు అనుమతి ఇస్తారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యం సీఎం స్టాలిన్ మాట్లాడారు. ఒమిక్రాన్ వేవ్ ను ఎదుర్కొవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తమిళనాడులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వ్యాక్సినేషన్ (vaccination) ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో కోవిడ్ వార్ రూమ్ (covid war rooms)_లను ఏర్పాటు చేశామని తెలిపారు. అసవరమైన అన్ని నగరాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించామని సీఎం చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసు డ్రైవ్ కు కూడా మంచి స్పందన వస్తోందని సీఎం ఉద్ఘాటించారు.
తమిళనాడు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 20,911 కోవిడ్ -19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,68,500కి చేరుకుంది. 24 గంటల్లో కరోనాతో 25 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 36,930కి చేరుకుంది. తమిళనాడులో ప్రస్తుతం 1,03,610 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ లో చివరి సారిగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. అప్పటి నుంచి ఇన్ని యాక్టివ్ కేసులు రావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అర్హులైన జనాభాలో 64 శాతం మందికి కోవిడ్-19 రెండు డోసుల వ్యాక్సిన్ వేశారు. 74 శాతం టీనేజర్లకు కూడా మొదటి డోసు కంప్లీట్ అయ్యింది.