
న్యూఢిల్లీ: మనం ఏదో ఒకసారి ట్రైన్‌లో ప్రయాణించే ఉంటాం. ఆ ప్రయాణాల్లో ఎన్నో విషయాలు గమనిస్తాం. ప్లాట్ ఫామ్ పై విషయాలు మొదలు ట్రైన్‌లో అందించే సేవలు, తోటి ప్రయాణికులు.. మధ్యలో వచ్చిపోయేవారు.. ఇతర విషయాలు పరిశీలిస్తూ ఉంటాం. ప్లాట్ ఫామ్ పై కూర్చుని మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ముందుగా వచ్చిన ఒక ట్రైన్ వెళ్లిపోతున్నప్పుడు దాని చివరి బోగీ వెనుకాల పెద్దగా పసుపు రంగులో ‘X’ గుర్తును చూసే ఉంటాం. కొన్నిసార్లు ఆ సింబల్ కనుమరుగైపోయే వరకూ దాని వంకే చూస్తూ ఉంటాం. ఈ సింబల్ దేన్ని సూచిస్తుంది అని అప్పుడో ఇప్పుడో.. ఎప్పుడో ఓ సారి ఆలోచించే ఉంటాం. కచ్చితమైన సమాధానం మాత్రం దొరికే అవకాశాలు చాలా తక్కువ. కానీ, భారత రైల్వే శాఖ ట్విట్టర్‌లో దీనిపై వివరణ ఇచ్చింది.
ట్రైన్ చివరి కోచ్‌కు వెనుకాల ‘X’ గుర్తుకు ఓ ప్రాధాన్యత ఉన్నదని తెలిపింది. చివరి బోగీకి ఆ సింబల్ ఉంటే.. ఆ ట్రైన్ ఒక్క బోగీని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ తీసుకుని వెళ్లిపోతున్నట్టు అర్థం కావడానికి ‘X’ సింబల్‌ను ఉపయోగిస్తారని వివరించింది.
Also Read: కుక్కను నేను కరవమని చెప్పానా?: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
ట్రైన్ చివర ‘X’ ఈ సింబల్ కనిపించిందంటే.. ఆ ట్రైన్ అన్ని బోగీలను వెంటేసుకుని వెళ్లుతున్నదని అర్థం చేసుకోవాలి. అంటే.. ఇంజిన్ ముందు వెళ్లుతూ ఉంటే వెనుక బోగీలు అన్నీ అనుసరిస్తున్నాయని అర్థం.
ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు.. కానీ, ఈ కచ్చితమైన సమాధానం కోసం లక్షల మంది ఆలోచించి ఉంటారనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ట్విట్టర్‌లో రెండు లక్షల మందికి పైగా ఈ పిక్‌ను చూశారు. వేలాది మంది లైక్ చేశారంటేనే ఈ ఎక్స్ ఫ్యాక్టర్ గురించి ఎంతమంది ఆలోచించారో అర్థం అవుతుంది.