'మెకానిక్ రాహుల్'.. బైక్ రిపేర్ చేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్

Published : Jun 28, 2023, 05:55 AM IST
'మెకానిక్ రాహుల్'.. బైక్ రిపేర్ చేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో  విస్తృతంగా పర్యటించారు. సాధారణ పౌరుడిలా అక్కడి వారితో కలియతిరిగారు. అక్కడున్న ఓ బైక్ మెకానిక్ షాప్‌ను సందర్శించారు. అక్కడి కార్మికుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.   

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ జోరును కొనసాగిస్తుంది. తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను జరుగనున్న రాష్ట్రాల్లో పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది. దీనికి అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతే కాకుండా పక్కాగా వాటిని అమలు చేయడానికి అవసరమైన సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీనే స్వయంగా రంగంలో దిగారు. భారత్ జోడో యాత్రతో మంచి క్రేజ్ సాధించుకున్న ఆయన మంగళవారం నాడు  ఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. సాధారణ పౌరుడిలా కరోల్ బాగ్‌కు వెళ్లారు. అక్కడున్న ఓ బైక్ మెకానిక్ షాప్‌ను సందర్శించారు. అక్కడ కార్మికులు, వ్యాపారులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే.. ఇక్కడ వాహనాలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటిని ఎలా రిపేర్ చేస్తారో తెలుసుకున్నారు. 

 అక్కడున్న ఓ బైక్ మెకానిక్ షాప్‌ను సందర్శించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. బైక్‌ను రిపేర్ చేసే సమయంలో వర్కర్లు వినియోగించే స్టూల్‌పై కూర్చుని వారితో ముచ్చటించారు. ఈ క్రమంలో తాను కూడా ఓ స్క్రూడ్రైవర్‌ను పట్టుకుని ఓ బైక్ నట్లను బిగించారు. అనంతరం పక్కనే ఓ షాప్‌లోకి వెళ్లారు. అక్కడ తయారయ్యే పరికరాల గురి అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు కరోల్ బాగ్‌లోనే గడిపాడు. ఓ సాధారణ పౌరుడిలా స్ట్రీట్ పుడ్ రుచి చూశారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చూసిన ప్రజలు చాలా సంతోషించారు. రాహుల్ గాంధీని  కలవడాని ప్రజలు ఆసక్తిగా కనబడించారు. ఆ క్రమంలో ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు.  


అంతకుముందు రాహుల్ గాంధీ హర్యానాలోని అంబాలాలో ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రక్కు డ్రైవర్లతో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యాయి.కాంగ్రెస్ నేత  డ్రైవర్లను కలుసుకుని, వారి జీవన విధానం గురించి, వారి ఆదాయ మార్గాల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిపై డ్రైవర్లు మాట్లాడుతూ రోజుకు 12 గంటల పాటు లారీలు నడుపుతున్నామని, ఇందుకు రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. దీనిపై రాహుల్ గాంధీ ట్రక్కు డ్రైవర్ల సమస్యలపై చర్చించారు. 

ఇలా రాహుల్ గాంధీ దేశంలోని చిన్న వర్గాల ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరులో డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై ప్రయాణించడం వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకోవడం చూసాం. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయింది. ఇలా ఉంటే.. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కారణంగా జూన్ 29న రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు. దీంతో పాటు అక్కడి క్యాంపులకు వెళ్లి ప్రజాప్రతినిధులతో సమావేశమై పరిస్థితిపై చర్చించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్