మళ్లీ కన్నుగీటిన రాహుల్...ఈసారి ఎవరికో తెలుసా?

By Arun Kumar PFirst Published Aug 13, 2018, 11:12 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వింత చేష్టలతో మరోసారి మీడియా కంటికి చిక్కాడు. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంపై  అవిశ్వాస తీర్మానం సందర్భంగా  రాహుల్ ఏకంగా పార్లమెంట్ లోనే తమ పార్టీ నాయకులను చూస్తూ కన్నుగీటిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో రాహుల్ వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే తాజాగా ఓ బహిరంగ సభలోనూ రాహుల్ అలాగే కన్నుగీటడం మరోసారి వివాదాస్పదమైంది.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా జైపూర్ లో నిన్న ఆదివారం ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సచిన్ ఫైలట్ ను చూస్తూ రాహుల్ మరోసారి కన్నుగీటారు. అయితే ఆ వీడియో బైటకు రావడంతో మరోసారి వివాదాస్పదమైంది. 

గతంలో పార్లమెంట్ సాక్షిగా ఇలా కన్నుగీటడంతో లోక్ సభ స్పీకర్ తో సహా పలువురు నాయకులు రాహుల్ ని విమర్శించిన విసయం తెలిసిందే. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా హుందాగా ప్రవర్తించి ఉండాలని చాలా మంది సూచించారు. అయితే రాహుల్ వారి మాటలను వినిపించుకున్నట్లు లేరు. మరోసారి ఓ బహిరంగ సభలో ప్రజల ముందే ఇలా కన్నుగీటి మరోసారి నెటిజన్లు, ప్రజల దృష్టిలో తన హుందాతనాన్ని కోల్పోయారు.

కేవలం కన్నుకోట్టడమే కాదు...కౌగిలింతల కార్యక్రమం కూడా చేపట్టారు రాహుల్. రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ వైపు చూస్తూ కన్నగొట్టి, మరో సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ను ఆలింగనం చేసుకున్నారు. దీంతో పార్లమెంట్ సీన్ మళ్లీ రిఫీటయ్యిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.     

click me!