కారణమిదే: కానిస్టేబుల్‌‌ను ప్రశంసించిన సీఎం

Published : Aug 11, 2019, 12:35 PM ISTUpdated : Aug 11, 2019, 01:23 PM IST
కారణమిదే: కానిస్టేబుల్‌‌ను ప్రశంసించిన సీఎం

సారాంశం

వరదల్లో చిక్కుకొన్న ఇద్దరు చిన్నారులను కానిస్టుబల్ తన భుజాలపై మోసుకొచ్చాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్: విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌పై గుజరాత్ సీఎం  విజయ్ రూపానీ ప్రశంసలు కురిపించారు. భారీ వరదల్లో చిక్కుకొన్న ఇద్దరు చిన్నారులను తన భుజాలపై మోసుకొంటూ కానిస్టేబుల్ పృథ్వీసింగ్ జడేజా వెళ్లిన  దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

కానిస్టేబుల్ పృథ్వీరాజ్‌సింగ్  జడేజా చూపిన ధైర్య సాహసాలకు దేశం మొత్తం ఆయనను అభినందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ సింగ్ జడేజా ఓ ఉదహరణగా నిలుస్తారని సీఎం విజయ్ రూపానీ అభిప్రాయపడ్డారు.

భుజాలలోతు వరకు ఉన్న నీటిలో ఇద్దరు చిన్నారులను మోసుకొంటూ కానిస్టేబుల్ పృథ్వీరాజ్ సింగ్ జడేజా ఒడ్డుకు చేరారు. పృథ్వీరాజ్ సింగ్ చౌహన్ చిన్నారులను ఒడ్డుకు చేర్చే దృశ్యాలను అక్కడే ఉన్న మరో వ్యక్తి తన మొబైలో చిత్రీకరించాడు.
 

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు