గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ.. 22న క్యాంపెయిన్

Published : Nov 13, 2022, 11:30 PM IST
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ.. 22న క్యాంపెయిన్

సారాంశం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. నవంబర్ 22వ తేదీన ఆయన గుజరాత్‌లో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనబోతున్నారు. భారత్ జోడో యాత్రకు బ్రేక్ తీసుకున్న సమయంలో ఈ క్యాంపెయిన్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 22వ తేదీన ఆయన గుజరాత్‌లో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇస్తున్న సమయంలో ఆయన గుజరాత్‌కు వెళ్లబోతున్నారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన, డిసెంబర్ 5వ తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొనలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన క్యాంపెయిన్ చేయడం లేదనే ఆరోపణలు వచ్చాయి. రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఆయన ప్రచారం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య కూడా లోపాయికారీ ఒప్పందం ఉన్నదా? అని ఇతర రాజకీయ పార్టీల నేతలు లేవనెత్తారు.

Also Read: Gujarat Election 2022: తొలి దశ ఓటింగ్ కోసం కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా ఇదే..

అంతేకాదు, ఆయన తమిళనాడు కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్‌ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్‌లోనూ గుజరాత్ లేదు. అంటే.. మహారాష్ట్ర వరకు వెళ్లి గుజరాత్‌కు వెళ్లకుండా పొరుగు రాష్ట్రం నుంచి దక్షిణాది వైపుకు వెళ్లిపోతున్నారు. ఇది కూడా కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యపరచడమే కాదు.. నిరాశకు లోను చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని, అక్కడ బీజేపీకి బలమైన ప్రత్యర్థి పార్టీగా ఇప్పుడు ఆప్ కనిపించడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కాంగ్రెస్ సీట్లనే కొల్లగొట్టే అవకాశాలూ ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం రావడం గమనార్హం.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022 కోసం తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసింది. ఆ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 104కు చేరుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్