కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు దానిని భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగళూరులో జరిగిన విపక్ష పార్టీల కూటమి సమావేశంలో పాల్గొన్న వీరిద్దరూ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.