
North Atlantic Treaty Organization: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే, ఉక్రెయిన్ లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ వారు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు సంబంధించిన వీడియోలు వైరల్ మారుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లోని బంకర్లలో తలదాచుకున్న దీన స్థితిని వివరిస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. విద్యార్థులు బంకర్లలో ఆశ్రయం పొందుతున్నట్లు శుక్రవారం వార్తలు రావడంతో, వెంటనే అక్కడి నుంచి వారిని తీసుకురావడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. మరోసారి అక్కడ చిక్కుకుపోయి.. బంకర్లలో తలదాచుకుంటున్న భారతీయుల దీన స్థితికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేస్తూ.. వారిని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. "బంకర్లలో ఉన్న భారతీయ విద్యార్థుల దృశ్యాలు కలవరపెడుతున్నాయి. చాలా మంది దాడిలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. నా ఆలోచనలు వారు... వారి బంధువుల చుట్టే తిరుగుతున్నాయి. వారిని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
వీడియోలో విద్యార్థులు చాలా కఠినమైన పరిస్థితుల కారణంగా కుప్పకూలిపోయారని కూడా పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితి కారణంగా బంకర్లలో తలదాచుకున్న వారి సంఖ్య అధికంగా.. రద్దీ కారణంగా వారిలో చాలా మంది అపస్మరక స్థితిలోకి వెళ్లినట్లు ఆ వీడియోలో కనిపించిన విద్యార్థులు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే భారత్ పలువురిని తరలించింది. వీడియోలో, విద్యార్థులు చాలా కఠినమైన పరిస్థితుల కారణంగా కుప్పకూలిపోయారని కూడా పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంయికి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం భారత్ కు బయల్దేరినట్లు ఆయన తెలిపారు.