మేము బహుశా తెలంగాణను గెలుస్తాము: అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Published : Sep 24, 2023, 01:29 PM ISTUpdated : Sep 24, 2023, 01:51 PM IST
మేము బహుశా తెలంగాణను గెలుస్తాము:  అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేతరాహుల్ గాంధీ ఈ ఏడాది చివరన జరగనున్న ఐదు రాష్ట్రా  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ అగ్రనేతరాహుల్ గాంధీ ఈ ఏడాది చివరన జరగనున్న ఐదు రాష్ట్రా  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ మీడియా కాన్‌క్లేవ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో తాము ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామని  చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్షాల వాదనను ప్రజలకు చేరకుండా దృష్టి మరల్చే కార్యక్రమాలు బీజేపీ చేస్తుందని ఆరోపించారు. అయితే కర్ణాటకలో తాము ఏం చెప్పాలని అనుకున్నామో అది ప్రజలకు చేరేలా చెప్పగలిగామని రాహుల్ అన్నారు. 

ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి రాహుల్ స్పందిస్తూ.. తాము బహుశా తెలంగాణను గెలుస్తామని అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్తాన్‌లో తాము విజయానికి దగ్గరగా ఉన్నామని.. కచ్చితంగా గెలవగలమనే నమ్మకం ఉందని చెప్పారు. బీజేపీ కూడా అంతర్గతంగా ఇదే చెబుతుందని అన్నారు. 

ప్రతిపక్షాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఆశ్చర్యానికి గురిచేసే ఫలితాలు వస్తాయని రాహుల్ గాంధీ అన్నారు. ఇక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?