రాజ్యాంగ సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ స్వాధీనం చేసుకోవడాన్ని' ఇండియా' అనుమతించదు: రాహుల్ గాంధీ

Published : Sep 22, 2023, 04:20 AM IST
రాజ్యాంగ సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ స్వాధీనం చేసుకోవడాన్ని' ఇండియా' అనుమతించదు: రాహుల్ గాంధీ

సారాంశం

దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, కానీ మన ప్రజాస్వామ్య నిర్మాణం కోసం చాలా మంది పోరాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. వారు దేశాన్ని కాపాడుతున్నారనీ,  వారి రక్షణ ఆగిపోయిన రోజు.. భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి దూకుడు ప్రదర్శించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందన్నారు. నేడు భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అనుమతి లేదని విమర్శించారు. 

రాహుల్ గాంధీ ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో ఆయన నార్వేలోని ఓస్లో యూనివర్సిటీకి చేరుకున్నారు. ఇక్కడ అతను భారతదేశ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, అయితే.. మన ప్రజాస్వామ్య నిర్మాణం కోసం ఇంకా చాలా మంది పోరాడుతున్నారని రాహుల్ గాంధీ వీడియోలో పేర్కొన్నారు. వారు దేశాన్ని కాపాడుతున్నారు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇక మిగిలిపోదని చెబుతాననీ, ఈ యుద్ధంలో మనం గెలుస్తామని భావిస్తున్నానని అన్నారు.

 అలాగే.. యూనివర్శిటీలో ఇండియా-భారత్ వివాదంపై కూడా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశం పేరును భారత్‌గా మారుస్తుంటే ప్రతిపక్ష కూటమి కూడా తమ గ్రూప్‌కు భారత్‌ అని పేరు పెడుతుందని, ఆ తర్వాత ప్రధాని దేశం పేరు మార్చాల్సి వస్తోందన్నారు. కేవలం రాజకీయ పార్టీ పేరు మార్చడం తెలుసు గానీ, దేశం పేరు మార్చాలని భావించడం ఓ రికార్డు అని అన్నారు.

ప్రధాని మోదీపై విమర్శల దాడి

ఐరోపా పర్యటనలో గాంధీ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని ఎవరూ సహించరని అన్నారు. ముందుగా.. దేశంలోని అన్ని సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ని స్వాధీనం చేసుకోవడానికి తాము అనుమతించమని అన్నారు. రెండోది.. దేశంలోని రెండు-మూడు వ్యాపార సంస్థల గుత్తాధిపత్యం కారణంగా, దేశంలోని 200 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. మూడవది.. ప్రభుత్వం ఆరోగ్యం , విద్య రంగాలపై ఎక్కువ ఖర్చు చేయాలి. కానీ అలాంటి పరిస్థితులేవని అన్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతంపై కూడా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశం మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, గురునానక్‌ల సిద్ధాంతాల దేశమని అన్నారు. తాను దాని కోసం పోరాడుతున్నాను. ప్రధాని మోదీ ఒక సిద్ధాంతాన్ని మాత్రమే సమర్థిస్తారని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu