రాహుల్ గాంధీ అహంకారం వల్లే శిక్ష పడింది - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

Published : Apr 04, 2023, 08:54 AM IST
రాహుల్ గాంధీ అహంకారం వల్లే శిక్ష పడింది - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

సారాంశం

రాహుల్ గాంధీ అహకారం వల్లే ఇంత వరకు వచ్చిందని, ఆయన ముందే క్షమాపన చెప్పి ఉంటే శిక్ష పడేది కాదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. సోమారం మీడియాతో మాట్లాడిన శర్మ.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 

లోక్ సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై సోమవారం విరుచుకుపడ్డారు. ప్రతీ ఒక్కరూ తమ పనిలో బిజీగా ఉన్నారని, రాహుల్ గాంధీ కోసం ఎవరికీ సమయం లేదని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

మృత్యువుకు భయపడను: పంజాబ్ శాంతిభద్రతలపై నవజ్యోత్ సిద్ధూ మండిపాటు.

‘‘క్షమాపణ చెప్పి ఉంటే రాహుల్ గాంధీకి ఎలాంటి శిక్ష పడేది కాదు. కానీ ఆయన అందుకు నిరాకరించారు. ఆయన అహంకారం వల్లే ఇలా జరుగుతోంది’’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. కాగా.. రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2019 పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా అప్పీల్ చేశారని, కోర్టుకు హాజరుకావడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

‘‘ మీ అహంకారాన్ని ప్రదర్శించడానికి, న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడానికి, దర్యాప్తు సంస్థలను బెదిరించడానికి మీరు అక్కడికి వెళ్లారా?’’ అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు సహా పలువురు సీనియర్ నేతలు సోమవారం గుజరాత్ కోర్టుకు రాహుల్ గాంధీ వెంట వెళ్లారు. ఇందులో రాహుల్ గాంధీ సోదరి, పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల జాబితా తయారు చేసిన కేంద్రం.. ఎవరెవరు.. ఎక్కడ ఉన్నారంటే..?

2019 ఏప్రిల్ లో ఎన్నికల ప్రచారంలో ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసులో దోషిగా తేలడంతో అప్పీల్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరించే వరకు బెయిల్ మంజూరు చేసింది.

PREV
click me!

Recommended Stories

మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!
2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu