
చత్తీస్ గఢ్ : చతిస్ గఢ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ వివాహానికి వచ్చిన హోమ్ థియేటర్ను ఇన్స్టాల్ చేసుకుని.. సరదాగా చూద్దామనుకున్న నవవరుడు అది పేలడంతో మృతి చెందాడు. అతనితోపాటు ఆ సమయంలో అక్కడే ఉన్న మరో బంధువు కూడా మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన చత్తీస్గఢ్లో కలకలం రేపింది. అక్కడి కబీర్దామ్ జిల్లా.. చమరి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని హేమేంద్ర మేరవిగా పోలీసులు గుర్తించారు.
రెండు రోజుల క్రితమే హేమేంద్రకు వివాహం జరిగింది. హోం థియేటర్ ఆ వివాహంలోనే పెళ్లి కానుకగా ఎవరో చదివించారు. వివాహతంతు ఎక్కడిదక్కడ ముగిసిన తర్వాత ఆదివారం నాడు హేమేంద్ర దాన్ని బయటికి తీసి చూశాడు. ఇంట్లో ఓ చోట దాన్ని ఇన్స్టాల్ చేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. ఆన్ చేసేలోపే హోమ్ థియేటర్ పేలి పోయింది. ఈ క్రమంలో హేమేంద్రకు ఓ బంధువు సహాయపడ్డాడు.. అతను కూడా ఆ పేలుడులో అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి ఇళ్లు కావడంతో ఎక్కువ మంది బంధువులు ఉన్నారు. దీంతో మరో ఆరుగురు కూడా ఈ పేరులో తీవ్రంగా గాయపడ్డారు.
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల జాబితా తయారు చేసిన కేంద్రం.. ఎవరెవరు.. ఎక్కడ ఉన్నారంటే..?
పెళ్లయిన ఒక్కరోజుకే మ్యారేజ్ గిఫ్ట్ రూపంలో వచ్చిన హోమ్ థియేటర్ పేలి ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి.
పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పైకప్పు ఎగిరిపోయి గోడ కూలిపోయింది. కొద్దిసేపటికే ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. చాలా దూరం వరకు ఈ పేలుడు శబ్ధం వినిపించింది.
విషాద ఘటన ఎలా జరిగిందంటే.. చమరి గ్రామం కవర్ధకు చెందిన హేమేంద్ర మెరవి అనే వ్యక్తికి అంజన గ్రామానికి చెందిన యువతితో రెండు రోజుల క్రితం వివాహం జరిగినట్లు స్థానికులు సమాచారం అందించారు. సోమవారం కుటుంబ సభ్యులు పెళ్లి కానుకను విప్పుతుండగా, కొత్తగా బహుమతిగా ఇచ్చిన హోమ్ థియేటర్‌కు ఎవరో ప్లగ్ చేయడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు.
హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు రాజ్‌కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కబీర్‌ధామ్ పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రాంతం నక్సల్స్ ప్రభావిత జోన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి, నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు పోలీసులు అన్ని కోణాలను పరిశీలించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.