దర్బాంగా బ్లాస్ట్‌లో మరో సంచలనం: రా ఏజంట్లుగా నమ్మించిన మాలిక్ సోదరులు

By narsimha lodeFirst Published Jul 4, 2021, 10:32 AM IST
Highlights

దర్బాంగా బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది.    రా ఏజంట్లుగా కుటుంబసభ్యులను నమ్మించారు మాలిక్ బ్రదర్స్.ఇండియన్ రా ఏజంట్లుగా  నమ్మించారు. ఇది నిజమని కూడ కుటుంబసభ్యులు నమ్మారు. అయితే దర్బాంగా పేలుళ్లు చోటు చేసుకొన్న తర్వాత అసలు విషయం తెలిసి  మాలిక్ బ్రదర్స్ కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.

హైదరాబాద్: దర్బాంగా బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది.    రా ఏజంట్లుగా కుటుంబసభ్యులను నమ్మించారు మాలిక్ బ్రదర్స్.ఇండియన్ రా ఏజంట్లుగా  నమ్మించారు. ఇది నిజమని కూడ కుటుంబసభ్యులు నమ్మారు. అయితే దర్బాంగా పేలుళ్లు చోటు చేసుకొన్న తర్వాత అసలు విషయం తెలిసి  మాలిక్ బ్రదర్స్ కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.

also read:దర్బాంగా పేలుడు: ఫేక్ పాన్ కార్డు, మొబైల్‌ సమాచారంతో పార్శిల్ బుకింగ్

మాలిక్ సోదరుల తండ్రి మూసాఖాన్  ఆర్మీలో పనిచేశాడు. తరచూ తన కొడుకులు ఫోన్లో మాట్లాడడంపై ఆయన వారిని ప్రశ్నించారు. తాము ఇండియన్  రా ఏజంట్లుగా పనిచేస్తున్నామని తండ్రిని నమ్మించారు.  రా విభాగంలో తమకు ఆఫీసర్ ఓ టాస్క్ అప్పగించారని పేరేంట్స్ ను నమ్మించారు. 

'రా' పనిచేసేందుకే తాము పాకిస్తాన్ వెళ్తున్నామని చెప్పి 2012 లో మాలిక్  సోదరులు పాకిస్తాన్ వెళ్లారని ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద వీరిద్దరూ ట్రైనింగ్ తీసుకొన్నారు.2012లో పాకిస్తాన్ వెళ్లిన వీరిద్దరూ 4 నెలలపాటు ట్రైనింగ్ తీసుకొన్నారు. 2016లో దుబాయి వెళ్లారు.ఐఈడీ అమర్చడంలో కూడ నాసిర్ మాలిక్  మాస్టర్ మైండ్ గా ఎన్ఐఏ గుర్తించింది. గత నెల 17వ తేదీన బీహార్ రాష్ట్రంలోని దర్భాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు చోటు చేసుకొంది. పేలుడుకు ముందు ఏం జరిగిందనే విషయమై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.

click me!