పెట్రోల్ ధరల తగ్గింపుకై విజయ్‌ చౌక్ వద్ద కాంగ్రెస్ ధర్నా: పార్లమెంట్ వరకు రాహుల్ నేతృత్వంలో ర్యాలీ

Published : Mar 31, 2022, 10:35 AM ISTUpdated : Mar 31, 2022, 10:49 AM IST
పెట్రోల్ ధరల తగ్గింపుకై విజయ్‌ చౌక్ వద్ద కాంగ్రెస్ ధర్నా: పార్లమెంట్ వరకు రాహుల్ నేతృత్వంలో ర్యాలీ

సారాంశం

పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయ్ చౌక్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

న్యూఢిల్లీ:పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపెను నిరసిస్తూ గురువారం నాడు న్యూఢిల్లీలోని Vijay chowk  వద్ద Congress ఎంపీలు ఆందోళన చేశారు. Rahul Gandhi  నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. 

ఈ ఆందోళన కార్యక్రమంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, Rajya sabha కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, అభిషేక్ మను సింఘ్వి, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ , తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసనకు దిగారు.

petrol, Diesel ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ukriane పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలోని చమురు సంస్థలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. 10 రోజుల్లో తొమ్మిది రోజుల పాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచారు. లీటరకు సుమారు రూ. 6.40 పైసలు ధరలు పెరిగాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.81 గా ఉంది. డీజీల్ ధర రూ.93.07 గా ఉంది. పెంచిన పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.విజయ్ చౌక్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

అయితే అంతర్జాతీయ మార్కెట లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూడా దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు భారీగానే ఉన్నాయి. పెట్రోల్, డీజీల్ లపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పన్నుల వడ్డనతో వినియోగదారులపై బారం మోపారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర కంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ముడి చమురు ధర బాగా తగ్గింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.  అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా కూడా  పెట్రోల్, డీజీల్ ధరలను మాత్రం తగ్గించలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu