Rahul Gandhi: "ప్ర‌ధాని ల్యాబ్ లో కొత్త ప్ర‌యోగం.. ప్ర‌మాదంలో దేశ భద్రత, యువత":  రాహుల్ గాంధీ 

Published : Jul 24, 2022, 04:41 PM IST
Rahul Gandhi: "ప్ర‌ధాని ల్యాబ్ లో కొత్త ప్ర‌యోగం.. ప్ర‌మాదంలో దేశ భద్రత, యువత":  రాహుల్ గాంధీ 

సారాంశం

Rahul Gandhi On Agnipath Scheme: ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ఈ కొత్త ప్రయోగంతో దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయని, అగ్నిపథ్ సైనిక నియామక పథకంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు.

Rahul Gandhi On Agnipath Scheme: మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ 'అగ్నీపథ్'పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. అగ్నీపథ్ అనేది ప్రధాని మోదీ కొత్త ప్రయోగమ‌నీ, ఈ ప్ర‌యోగం ద్వారా దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయని విమ‌ర్శించారు. మోదీ ‘ల్యాబ్’లో.. ఏటా 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తే... వారిలో 3 వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నాలుగేళ్ల కాంట్రాక్టు తర్వాత వేలల్లో పదవీ విరమణ పొందే అగ్నివీరుల భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్ర‌శ్నించారు. ప్రధాన మంత్రి త‌న‌ ప్రయోగశాలలో చేస్తున్న‌ ఈ కొత్త ప్రయోగంతో దేశ భద్రత, యువత భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడ్డాయని విరుచుక‌ప‌డ్డారు. 

అగ్నీపథ్ పథకం కింద.. 17న్నర సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను కేవలం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఆర్మీలో నియమించుకుంటారు. వారిలో 25 శాతం మందిని మాత్ర‌మే తదుపరి 15 సంవత్సరాల పాటు సైన్యంలో ఉంటారు. ఈ  ప‌థ‌కాన్ని ప్రకటించిన తర్వాత.. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర‌స‌న‌ ప్రదర్శనలు జరిగాయి. ఈ క్ర‌మంలో కేవలం 2022 సంవత్సరానికి గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలకు పెంచబడింది.

మరోవైపు..  యువతను ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు భారత సైన్యం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అగ్నిపథ్ పథకంపై అవగాహన కల్పించ‌డానికి భారత సైన్యం వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. లోయలోని యువతను భారత సాయుధ దళాలలో చేరమని ప్రోత్సహించే ప్రయత్నంలో, జమ్మూ మరియు కాశ్మీర్‌లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డ్‌తో కలిసి భారత సైన్యం శ్రీనగర్‌లో అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించింది, ఈ కార్యక్ర‌మంలో సహా అనేక మంది యువకులు పాల్గొన్నారు.

ప‌లు నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  NCC, NSS చెందిన‌ యువకులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ క్ర‌మంలో ఇండియన్ ఆర్మీ అధికారులు అగ్నిప‌థ్ పథకం యొక్క ప్రయోజనాలను వారికి వివరించారు. దానికి తోడు.. శ్రీనగర్‌లోని 31 సబ్ ఏరియా యొక్క GOC కూడా పాల్గొనే వారితో మాట్లాడి.. వారికి దాని గురించి వివరించింది. 

వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి సరైన కౌన్సెలింగ్ అందించడంతోపాటు సాయుధ దళాల్లో వృత్తిని చేపట్టేందుకు ఈ పథకంలో చేరేందుకు కూడా ప్రేరణ క‌లిగించింద‌ని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న యువ‌త అన్న‌ది. మరో యువకుడు అగ్నిపథ్ పథకాన్ని కొనియాడారు, ఇది లోయలోని ప్రజలకు అందించిన పెద్ద అవకాశం అని పేర్కొంటూ.. దేశానికి సేవ చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకం ద్వారా మాకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నాడు.

ఇదే అంశంపై శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అజాజ్ అసద్ మాట్లాడుతూ.. ఈ వర్క్‌షాప్‌కు జిల్లాలోని పలువురు యువకులు హాజరయ్యారని పేర్కొన్నారు. అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఉన్న ప‌లు సందేహాలు నివృత్తి చేయ‌డానికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. ఈ పథకం విప్లవాత్మకమైనది, భవిష్యత్తు ఆధారితమైనద‌ని ఆయన అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం