
Droupadi Murmu To Take Oath: భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆమె దేశంలోనే తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలు అయ్యారు. తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో నూతన భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము జూలై 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు దేశ అత్యున్నత పదవికి ప్రమాణం చేయనున్న తొలి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టించనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఆమె చేత సీజేఐ ఎన్. వి.రమణ ప్రమాదం చేయించనున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం.. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి చేత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీని తరువాత.. ఆమెకు 21 తుపాకీల గౌరవ వందనం సమర్ఫించనున్నారు. అనంతరం.. దేశాన్ని ఉద్దేశించి.. నూతన రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్యాధికారుల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పౌర, సైనిక అధికారులు హాజరుకానున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము విజయం సాధించడంతో ఎన్డీయేలో ఆనందం వెల్లివిరిస్తుండగా, దేశంలోని అన్ని రాష్ట్రాల నేతలు ఆయన విజయం పట్ల అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జూలై 25న, పదవీ ప్రమాణ స్వీకారం.. తర్వాత.. ముర్ము రాజ్యాంగంలోని అత్యున్నత పదవిని అలంకరించనున్నారు.
ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమ షెడ్యూల్:
ఉదయం 9.25 గంటలకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.
(రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న తర్వాత కొత్తగా నియమితులైన రాష్ట్రపతికి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తారు)
ఉదయం 9.50 - ద్రౌపది ముర్ము, రామ్ నాథ్ కోవింద్ కలిసి రాష్ట్రపతి భవన్ నుండి పార్లమెంట్ హౌస్‌కి కాన్వాయ్‌లో బయలుదేరుతారు
ఉదయం 10:03 - కాన్వాయ్ పార్లమెంటు గేట్ నంబర్ 5 వద్ద ఉన్న పార్లమెంట్ హౌస్‌కు చేరుకుంటుంది, వీటితో పాటు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ఇతరులతో సెంట్రల్ హాల్‌కు బయలుదేరుతారు.
ఉదయం 10:10 - సెంట్రల్ హాల్ వద్దకు చేరుకుంటారు.జాతీయ గీతం ఆలపన చేయబడుతుంది
ఉదయం 10:15 - ప్రమాణ స్వీకారం
ఉదయం 10:20 - నూతన అధ్యక్షుడి ప్రసంగం
ఉదయం 10:45 - రాష్ట్రపతి భవన్‌లో పార్లమెంటు నుండి కొత్త మరియు అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ బయలుదేరారు
ఉదయం 10:50 - రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్టులో హెడ్ ఓవర్ వేడుక
ఉదయం 11:00 - రాష్ట్రపతి భవన్ నుండి పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి వీడ్కోలు