రాహుల్ గోత్రం వివాదం: నెహ్రూ గోత్రం రాహుల్‌కు ఎలా వచ్చిందంటే..?

By sivanagaprasad kodatiFirst Published Dec 3, 2018, 10:43 AM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రం విషయంలో దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్కర్ ఆలయానికి వెళ్లిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రం విషయంలో దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్కర్ ఆలయానికి వెళ్లిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీనిలో భాగంగా గోత్ర నామాలు చెప్పాల్సిందిగా పూజారి కోరడంతో ఆయన.. తన పేరు రాహుల్ గాంధీ అని.. తాను ‘‘కౌల్’’ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తినని, తనది దత్తాత్రేయ గోత్రమని తెలిపారు.  ఈ ఘటనను బీజేపీ టార్గెట్ చేసింది..

రాహుల్ తల్లి సోనియా గాంధీ స్వదేశం ఇటలీ కావడంతో ‘‘ఇట్లస్’’ అనే గోత్రాన్ని సృష్టించింది. ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ వివాహం చేసుకున్నప్పుడు నెహ్రూ గోత్రం రాహుల్‌కు ఎలా వచ్చిందంటూ బీజేపీ నేతలు కామెంట్ చేశారు.

దీంతో కాంగ్రెస్, భాజపా శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు పుష్కర్‌ ఆలయ పూజారి. నెహ్రూకి మగ సంతానం లేనందున ఆయనకి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేసింది ఇందిరాగాంధీనే అని.. అందుకే నెహ్రూ గోత్రం ఇందిరకు ఆ తర్వాత రాజీవ్‌గాంధీకి ఆయన తదనంతరం రాహుల్ గాంధీకి వచ్చిందని పూజారి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ కులం, గోత్రం ఏంటో తెలుసా?
 

click me!