మూడు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ గాంధీకి జోష్!

By Prashanth MFirst Published Dec 11, 2018, 1:11 PM IST
Highlights

జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అందిన విజయాలు ఆ పార్టీని జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా నిలబెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

హిందీ మాట్లాడే ఈ మూడు రాష్ట్రాల్లో (మధ్య ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ రాజస్థాన్) 2014లో  65  సీట్లలో 62  స్థానాలను దక్కించుకొని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయ భేరి మోగించింది. అయితే బీజేపీ మరోసారి ఆ స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ గతంలో కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ సారి గణనీయంగా సీట్లను పెంచుకునే ఆస్కారం ఉంది. 

- త్వరలో ఏర్పాటుకానున్నా మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏదైతే ఉందొ అందులో కాంగ్రెస్ వెనుక సీట్లో ఉండగా ఇప్పుడు డ్రైవర్ సీట్ ను ఆక్రమిస్తుందనడంలో నో డౌట్. బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి ఏర్పాటుచేయనున్న పార్టీలకు కాంగ్రెస్ రూపంలో ఒక ఆలంబన దొరకగా ఇప్పుడు కాంగ్రెస్ ఒక బలమైన ప్రతిపక్షంగా ఎన్నికలకు వెళ్లే వీలుంటుంది.      

- ఇప్పటి వరకు మోడీని ఎదిరించగల స్థితిలో రాహుల్ గాంధీ కనపడలేదు. ఎక్కడా గొప్పస్థాయిలో విజయాలందుకోలేకపోయిన రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష్య బాధ్యతలను చెప్పటి సరిగ్గా నేటికీ సంవత్సరమైన వేళ తన కష్టం ఫలించడంతో పాటు ఒక స్ట్రాంగ్ లీడర్ గా తన ఇమేజ్ ను పెంచుకోవడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. 

- ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో కాకుండా నేరుగా బీజేపీతోనే అత్యధిక స్థానాల్లో తలపడింది. ఈ విజయం ఎంతో కొంత కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. 

- పూర్తిగా పరిశీలించుకుంటే 2019 ఫైనల్స్ కు ముందు జరిగిన ఈ సెమీఫైనల్స్ కాంగ్రెస్ పుంజుకోవడానికి నూతనోత్తేజాన్ని కలిగించింది అనడంలో నో డౌట్.

click me!