3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి కారణాలివే!

By Prashanth MFirst Published Dec 11, 2018, 11:51 AM IST
Highlights

2013లో రాజస్థాన్, చత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకోవడం ద్వారా కేంద్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకొని అధికారంలోకి వచ్చింది. ఈ 3 హిందీ రాష్ట్రాల్లోని 65 ఎంపీ స్థానాలలో బీజేపీ 62 స్థానాలను కైవసం చేసుకొని చాలా తేలికగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది. 

ఇక ఇప్పుడు అదే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పార్టీ శిబిరాల్లో కూడా 2019 సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ విజయానికి గల కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.. 

- చత్తిస్ ఘడ్, మధ్య ప్రదేశ్ లో గత 15 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండడటంతో సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేఖత కాంగ్రెస్ విజయానికి కారణమని చెప్పవచ్చు. రాజస్థాన్ విజయానికి వస్తే ప్రతి ఐదేళ్ళలోకొకసారి అధికార బదిలీకి ఓటువేసే రాజస్థానీలు మరోసారి అదే సెంటిమెంట్ ను రుజువు చేశారు. 

- ఈ మూడు రాష్ట్రాలు మోడీ ఫెస్ వాల్యూతో కాకుండా , ఆ రాష్ట్రాల నాయకుల కేంద్రంగానే ప్రచారం సాగింది. రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత నాయకత్వం, పార్టీలో అంతర్గత స్వేచ్ఛ లేని కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. 

- ఈ 3 రాష్ట్రాల్లో కూడా గ్రామీణా ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. రైతులు చాలా వరకు వ్యవసాయ రంగంలో నెలకొన్న నిరాశాజనక వాతావరణం దృష్ట్యా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెప్పవచ్చు. 

- ఈ మూడు రాష్ట్రాల్లో కనుక మోడీ ప్రచార సభలను మొదటిసారిగా చూసుకుంటే నెగిటివ్ గానే సాగింది. అదే 2014లో మేము ఏం చేయబోతున్నాం, ఎలా అభివృద్ధి చెస్తాం అనేది చూపెడతాం అని చెప్పిన మోడీ ఈ సారి పూర్తిగా బాధిత కార్డు వాడుతూ బాదితుడిగా తనపై కాంగ్రెస్ వారు ఎలా వ్యక్తిగత దూషణలు పాల్పడుతున్నారో అనే విషయాన్నీ మాత్రమే  చెప్పారు. దానికి భిన్నంగా కాంగ్రెస్ అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగింది. 

- కాంగ్రెస్ టీమ్ గేమ్ ఆడగా, బీజేపీ మాత్రం ఒక లీడర్ కేంద్రంగా మాత్రమే తమ ప్రచారాన్ని సాగించాయి.    

click me!