బ్రెజిల్ మోడల్ కు ఇండియాలో 22 ఓట్లు... ఇదే బిజెపి ఓట్ చోరీ మోడల్.. : రాహుల్ గాంధీ

Published : Nov 05, 2025, 02:11 PM ISTUpdated : Nov 05, 2025, 02:43 PM IST
rahul gandhi

సారాంశం

Rahul Gandhi : లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఓట్ చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి, బిజెపి గెలుపుకు ఇదే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Vote Chor : ఓట్ చోర్ (ఓట్ల దొంగతనం).. కాంగ్రెస్ పార్టీ అధికార బిజెపిపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణ ఇది. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలుస్తోందనేది కాంగ్రెస్ వాదన... ఇందుకోసం దొంగఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే మీడియాముందుకు వచ్చి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు... దేశ ప్రజాస్వామ్యానికే మచ్చతెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు. వందలు వేలు కాదు ఏకంగా లక్షల్లో దొంగఓట్లను సృష్టించి గెలుపోటములను తారుమారు చేస్తున్నారు.. తద్వారా కాంగ్రెస్ గెలవకుండా చేస్తున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ తారుమారుతోనే అనుమానం : రాహుల్ గాంధీ

తాజాగా రాహుల్ గాంధీ ఈ ఓట్ చోర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సర్వే, ప్రతి ఒపినియన్ పోల్, ప్రతి ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చాయి... కానీ పలితం మాత్రం బిజెపికి అనుకూలంగా వచ్చిందని గుర్తుచేశారు. దీంతో ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశామని... ఈ క్రమంలో అసలు నిజాలు బైటపడ్డాయన్నారు. దొంగ ఓట్లతోనే పలితాలను తారుమారు చేశారని రాహుల్ ఆరోపించారు.

హర్యానాలో మొత్తం 2 కోట్లమంది ఓటర్లుంటే ఇందులో 25 లక్షల దొంగఓట్లను సృష్టించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకే పోటోతో ఒకే అసెంబ్లీ స్థానంలో 100 కు పైగా ఓటర్లుండటం గమనించామన్నారు. మరోచోట ఓ మహిళ పేరు కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 సార్లు ఉందన్నారు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అవకతవకలకు పాల్పడ్డారు... అందువల్లే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయని తెలిపారు. ఒక్క హర్యానాలోనే కాదు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి దొంగఓట్లతో విజయం సాధిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల దొంగతనం 5 వేర్వేరు కేటగిరీలలో జరిగుతోందని పేర్కొన్నారు. అంటే ఇది ఏదో పొరపాటుగా, యాదృచ్ఛిక జరగడం లేదు... ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోందన్నారు. ఇది కేవలం ఒక్క అసెంబ్లీలో కాదు... మొత్తం ఎన్నికల వ్యవస్థలో జరుగుతోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

బ్రెజిల్ మోడల్ కు 22 ఓట్లు : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ ఒక అమ్మాయి ఫోటో చూపిస్తూ, “ఈ అమ్మాయి 10 బూత్‌లలో 22 సార్లు ఓటు వేసింది, ప్రతీసారి వేరేవేరే పేరుతో... ఒకచోట ఈమె సీమా, మరోచోట స్వీటీ. కానీ నిజానికి ఈమె ఒక బ్రెజిల్ మోడల్” అని అన్నారు. ఈ అమ్మాయి పేరుతో 22 ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు... సేమ్ ఇదే పద్ధతిని హర్యానా అంతటా అనుసరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

తన దగ్గర ప్రస్తుతం కొన్ని ఫైల్స్ ఉన్నాయి... రాష్ట్ర స్థాయిలో డేటాను ఎలా దొంగిలించి ఎన్నికల ఫలితాలను మార్చారో అందులో వివరంగా ఉందన్నారు రాహుల్. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినా ఫలితాలు ఎలా తారుమారయ్యాయో ఈ ఫైల్ లో సమాచారాన్ని బట్టి అర్థమయ్యిందన్నారు. పోస్టల్ ఓట్లకు, అసలు పోలింగ్‌కు మధ్య ఇంత పెద్ద తేడా రావడం హర్యానా చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ భారీ విజయాన్ని ఓటమిగా మార్చారని మేము 100% ఆధారాలతో చెబుతున్నాం... ఇది కేవలం ఓట్ల దొంగతనం కాదు, ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి నాయబ్ సైనీ మాటలను రాహుల్ గాంధీ గుర్తుచేశారు. పలితాలకు ముందే ఆయన గెలుపుపై ధీమాతో ఉన్నారు... “మా దగ్గర వ్యవస్థ ఉంది” అనడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈయన చెప్పిన వ్యవస్థ ఈ దొంగఓట్లేనా? ఫలితాలు రాకముందే అంతా ఫిక్స్ అయ్యిందా? అనే అనుమానం వచ్చిందన్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ ఆరోపణలు హర్యానా నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలను కుదిపేశాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. ఈ “ఓట్ల దొంగతనం” ఆరోపణపై ఈసి ఎలాంటి వైఖరి తీసుకుంటుందో, ఈ కొత్త “ఎన్నికల కుంభకోణం” నిజమని తేలుతుందో లేక మరో రాజకీయ ఆరోపణగా మిగిలిపోతుందో చూడాలి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు