రాహుల్ గాంధీకి చుక్కెదురు: పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టేకి నిరాకరణ

By narsimha lode  |  First Published Jul 7, 2023, 11:11 AM IST


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది.  


న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత   రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో  చుక్కెదురైంది.ప్రధాని నరేంద్ర మోడీపై  వివాదాస్పద వ్యాఖ్యలపై  సూరత్ కోర్టు  ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.   అయితే  సూరత్ కోర్టు తీర్పుపై  స్టే ఇచ్చేందుకు  గుజరాత్ హైకోర్టు నిరాకరించింది.

2019  ఏప్రిల్ 13న  కర్ణాటకలోని  కోలార్ లో జరిగిన  ఎన్నికల ర్యాలీలో  ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా వచ్చిందని వ్యాఖ్యలు  చేశారు.  ఈ వ్యాఖ్యలపై  గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన  సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి  23న  రాహుల్ గాంధీకి  రెండేళ్ల జైలు శిక్షను విధించింది.  

Latest Videos

దీంతో  రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై  అనర్హత వేటు కూడా పడింది.  సూరత్ కోర్టు  తీర్పుపై ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. అయితే  సెషన్స్ కోర్టు కూడ  రాహుల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ  ఈ ఏడాది ఏప్రిల్  25న  గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ పై  ఇరువర్గాల  వాదనలు విన్న తర్వాత  సూరత్ కోర్టు  ఇచ్చిన  తీర్పుపై స్టే ఇచ్చేందుకు  గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. 

గుజరాత్ హైకోర్టు తీర్పు  విషయమై  రాహుల్ గాంధీ   ఏం చేయనున్నారనే విషయమై ఇవాళ మధ్యాహ్నం  తేలనుంది.  ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన  నేతలు  న్యాయ నిపుణులతో  చర్చిస్తున్నారు.


 

click me!