పరువు నష్టం కేసు: కోర్టుకు హాజరైన రాహుల్‌గాంధీ

By narsimha lodeFirst Published Oct 10, 2019, 12:06 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ మాజీ చీప్ రాహుల్ గాంధీకి కష్టాలు తప్పలేదు. మాజీ కాంగ్రెస్ చీఫ్  రాహుల్ గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం నాడు కూడ సూరత్ కోర్టుకు ఆయన హాజరయ్యారు. 


గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ గురువారం నాడు సూరత్ కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ హాజరయ్యారు.

దొంగలంతా తమ పేర్ల చివరన మోడీ పెట్టుకొన్నారని గతంలో  రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.ఈ విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే పుర్నేష్ మోడీ రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.ఐపీసీ 499, 500 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి బి.హెచ్ కపాడియా రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు.

గత ఏడాది జూలై మాసంలో  రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యే విషయమై మినహాయింపు ఇచ్చింది కోర్టు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని  ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గురువారం నాడు సూరత్ కోర్టుకు హాజరయ్యారు.

బిజేపీ సూరత్ పశ్చిమ  ఎమ్మెల్యే   పుర్నేష్ మోడీ ఫిర్యాదు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో  రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు. ఈ విమర్శలను సీరియస్‌గా తీసుకొన్న పుర్నేష్ మోడీ ఫిర్యాదు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు.
 

click me!