జమ్మూ కశ్మీర్... పాక్, చైనాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

By telugu teamFirst Published Oct 10, 2019, 10:01 AM IST
Highlights

కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్, చైనాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత సార్వభౌమ హక్కుల కిందికి వచ్చే అంశంపై చైనా, పాకిస్తాన్ చర్చించడంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్... చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో దైపాక్షిక సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సమావేశంలో ఇద్దరు నేతలు కశ్మీర్ గురించి ఎక్కువగా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో ఈ విషయంలో భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది.  కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్, చైనాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత సార్వభౌమ హక్కుల కిందికి వచ్చే అంశంపై చైనా, పాకిస్తాన్ చర్చించడంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడం మానుకోవాలంటూ చైనాకు ఆయన స్పష్టం చేశారు. భారత్-చైనా ప్రయోజనాలకు ఇది మంచిది కాదంటూ హితవు పలికారు. 

‘‘చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య జరిగిన సమావేశంలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్న వార్తను మేము చూశాం. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న దానిపై భారత్‌కు స్థిరమైన, స్పష్టమైన వైఖరి ఉంది. ఈ విషయంలో మా వైఖరి చైనాకు కూడా బాగా తెలుసు. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలు మాట్లాడాల్సిన అవసరం లేదు ..’’ రవీశ్ కుమార్ పేర్కొన్నారు. 

click me!