రఘునందన్ రావు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం,

Published : Mar 14, 2024, 12:05 AM IST
రఘునందన్ రావు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం,

సారాంశం

Raghunandan Rao Biography: మాటలలో చతురత, కార్య శీలతలో దక్షత, విమర్శలలోనూ వైవిధ్యత అన్ని వేరసి ఆయనను రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిపాయి. మాట్లాడటమంటే.. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు.. వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం కాదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అంత కంటే కాదనీ, మాట్లాడే ప్రతి పదంలో సమగ్రత,  వివరణ, విశ్లేషణ ఉండాని చాటి చెప్పిన నేత. ఓ వేళ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే.. పక్కా ఆధారాలతో నిలదీయడం ఆయన నైజం. విమర్శలను సైతం వివరణాత్మకంగా చేసే నేత ఆయనే బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘనందన్ రావు. ఈ సమయంలో రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

Raghunandan Rao Biography: తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం వ్యక్తి రఘునందన్ రావు.. అనునిత్యం తన పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటాడనే పేరు ఆయన సొంతం. ఆయన ప్రదర్శించే మొండి ధైర్యం, పట్టుదల నిజంగా స్పూర్తిదాయకం.. పడినా ప్రతి సారి అంతకంటే.. వేగంగా ముందుకు సాగాడు. రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం ఇదే..

రఘునందన్ రావు బాల్యం, విద్యాభ్యాసం

రఘునందన్ రావు.. మార్చి 23,1968లో సిద్ధిపేటలో జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్, ఎల్ఎల్ బీ, బీ.ఎడ్, హ్యూమన్ రైట్స్ తో పీజీ డిప్లమా పూర్తి చేశారు. డిగ్రీ పట్టా పొందిన అనంతరం 1991లో పటాన్ చెరు ప్రాంతానికి నివాసం మార్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పొందిన రఘునందన్ రావు.. కెరీర్ మొదట్లో ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఐదేళ్ల పాటు న్యూస్ రిపోర్టర్ గా పని చేశారు.

ప్రారంభ జీవితం 

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరి న్యాయ సేవలందించారు. 2013లో అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ కేసును చేపట్టడంతో ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. నిజంగా అప్పుడు అదోక పెద్ద సెన్సేషన్. వృత్తి ధర్మం వేరు.. రాజకీయం వేరు అని అప్పట్లో పలు మార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. న్యాయవాద వృత్తిలో ఆయనకు మంచి పేరు వచ్చింది. 

రాజకీయ జీవితం  

అయితే చిన్నప్పటి నుంచి రఘునందన్ రావుకు  రాజకీయాలపై ఆసక్తితో వకీల్ సాబ్ గా చాలా బిజీబిజీగా ఉన్నా.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(ప్రస్తుతం బీఆర్ఎస్)లో ఓ కార్యకర్తగా చేరి  రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తరువాత పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఎదిగారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరిస్తూ.. కేసీఆర్ నాయకత్వాన్ని ముందుకు తీసుకపోవడంతో ప్రధాన భూమికను పోషించారు.  అసలేం జరిగిందో తెలియదు. కానీ, 2013లో టీఆర్ఎస్ అధిష్టానం కొన్ని కారణాలతో రఘునందన్ రావును సస్పెండ్ చేసింది. 

బీజేపీలో చేరిక

టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో రఘునందన్ రావు బీజేపీ గూటికి చేరారు. బీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బరిలో నిలిచాడు. కానీ.. ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2020లో దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలలో ఆయన గెలుపును గులాబీ నేతలు ఆపలేకపోయారు. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,074 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. అయితే.. రఘునందన్ రావు ఏ మాత్రం కుంగిపోలేదు. నిత్యం తన పార్టీకి, క్యాడర్ కు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రఘునందన్ రావుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చి మరో అవకాశాన్ని అందించింది. ఈ ఎన్నికల్లో గెలుపు వరిస్తుందో వేచి చూడాలి. 

మాధవనేని రఘునందన్ రావు బయోడేటా

పూర్తి పేరు: మాధవనేని రఘునందన్ రావు
పుట్టిన తేది: 23 మార్చి 1968 
పుట్టిన స్థలం: సిద్దిపేట, తెలంగాణ
పార్టీ పేరు: భారతీయ జనతా పార్టీ
చదువు:  B.Sc., B.Ed., LLB, PG డిప్లొమా  
వృత్తి: న్యాయవాది, రాజకీయవేత్త
తండ్రి పేరు: ఎం. భగవంతరావు
తల్లి పేరు    : మాధవనేని భారతి
జీవిత భాగస్వామి పేరు: మంజుల దేవి
మతం  :  హిందూ
శాశ్వత చిరునామా  :  బొప్పాపూర్ గ్రామం, దుబ్బాక, సిద్దిపేట జిల్లా

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People