
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా మన దేశంలోని పురాతన కట్టడాలపై వాద వివాదాలు జరుగుతున్నాయి. వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు మొదలు ఢిల్లీలోని తాజ్‌మహల్ వరకు సరికొత్త వాదనలు తెరమీదకు వస్తున్నాయి. తాజ్‌మహల్ తేజోమహాలయం అని, అందులో హిందూ ప్రతిమల కోసం గాలింపులు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కోణంలో తాజ్‌మహల్‌పైనా చర్చ జరిగింది. తాజాగా, ఢిల్లీలోని కుతుబ్ మినార్‌పైనా ఓ వాదన ముందుకు వచ్చింది.
ఢిల్లీలోని కుతుబ్ మినార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని, రాజా విక్రమాదిత్య నిర్మించాడని మాజీ ఆర్కియాలజీ రీజనల్ డైరెక్టర్ ధరమ్‌వీర్ శర్మ వెల్లడించారు. అది కూడా సూర్యుడిని పరిశీలించడానికి ఈ నిర్మాణం చేపట్టారని వివరించారు.
ఇది అసల కుతుబ్ మినారే కాదని, సన్ టవర్ (అబ్జర్వేటరీ టవర్) అని ఆర్కియాలజీ మాజీ అధికారి అన్నారు. ఈ కుతుబ్ మినార్‌ను ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య నిర్మించాడని, కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని వివరించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పురావస్తు శాఖ తరఫున ఆయన చాలా సార్లు టవర్‌ను సర్వే చేశాడు.
ఈ టవర్ 25 ఇంచుల మేరకు ఒక వైపు వంగి ఉంటుందని ఆయన వివరించారు. ఎందుకంటే.. ఈ కుతుబ్ మినార్ ద్వారా సూర్యుడిని పరిశీలించేవారని చెప్పారు. జూన్ 21న సొలస్టైజ్ నుంచి తప్పించుకోవడం కోసం కుతుబ్ మినార్‌ను ఇలా ఒక వైపు వంగినట్టుగా నిర్మించారని పేర్కొన్నారు. ఇదే శాస్త్రీయమైన నిజం అని చెప్పారు.
అందుకే స్వతంత్రంగా కనిపించే ఈ కుతుబ్ మినార్‌కు సమీపంలోని మసీదుకు సంబంధం లేదని వవిరించాడు. కుతుబ్ మినార్ ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. రాత్రి వేళ్లల్లో ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూడటానికి దీన్ని ఉఫయోగించుకున్నారని చెప్పారు.