ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి

By Siva KodatiFirst Published Jul 3, 2021, 3:48 PM IST
Highlights

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన బీజేపీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన బీజేపీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ధామి ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం.. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే సీఎంగా ఎంపిక చేసింది. 

నూతన సీఎంను ఎన్నుకునేందుకు ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు డెహ్రాడూన్‌లో శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ కూడా పాల్గొన్నారు. తొలుత సీఎం రేసులో సత్పాల్‌ మహారాజ్‌, ధనసింగ్‌ రావత్‌ పేర్లు ప్రధానంగా వినిపించాయి

కాగా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను గవర్నర్‌ బేబీ రాణి మౌర్యకు అందజేశారు. అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తీరత్‌ సింగ్‌.. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా ఉన్న తీరత్‌ను బీజేపీ అధిష్ఠానం నాలుగు నెలల కిందట త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో సీఎంగా నియమించింది.

Also Read:ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే.. ?

దీంతో ఆయన ఆరు నెలల్లోపే శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్‌ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా తీరత్ సింగ్ రాజీనామా చేశారు. 

click me!