మరోసటి రోజు పెళ్లి.. ఇంతలో ప్రియుడితో సోదరి జంప్.. కోపోద్రిక్తులైన సోదరుడు ఏం చేశారంటే..?

Published : Jun 21, 2023, 02:21 AM IST
మరోసటి రోజు పెళ్లి.. ఇంతలో ప్రియుడితో సోదరి జంప్.. కోపోద్రిక్తులైన సోదరుడు ఏం చేశారంటే..?

సారాంశం

బీహార్‌లోని పూర్నియాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ యువతి తన పెళ్లికి ఒక రోజు ముందు  తన ప్రేమికుడితో పారిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన బాలిక సోదరుడు ఆమె దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేసి పిండ ప్రదానం కూడా నిర్వహించారు.

బీహార్‌లోని పూర్నియా జిల్లా రూపాలి నియోజకవర్గంలో ఓ వింత ఘటన జరింగింది. ఓ అమ్మాయి పెళ్లికి ఒకరోజు ముందు తన ప్రేమికుడితో కలిసి పారిపోయింది. కాగా ఆమె పెళ్లికి కుటుంబ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పసుపు, గోరింట ఆచారం కూడా పూర్తయింది.  మరుసటి రోజు పెళ్లి  ఉదయం పెళ్లి. ఇంతలో ఆ యువతి ఎవ్వరూ ఊహించని విధంగా చేసింది. ఆమె తన ప్రేమికుడితో పారిపోయి, పెళ్లి చేసుకుని, తన కుటుంబ సభ్యులకు ఫోటో వీడియోలను పంపింది. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ఆ యువతి సోదరుడు తన సోదరిని బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం చేశాడు.

వివరాల్లోకెళ్తే.. పూర్ణియలోని టికపట్టిలో నివసించే ఓ యువతికి, ఆమె సమీప బంధువుతో వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిశ్చయించారు. శుక్రవారం పెళ్లి చేయాలని నిర్ణయించారు. వివాహానికి ముందు.. పసుపు గోరింట వేడుక ఉంది. మరుసటి రోజు పెళ్లి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కుటుంబీకులు. మరోవైపు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇంటి నిండా బంధువులు.. అంతా సందడి సందడిగా ఉంది. ఇంతలో బాలిక ఇంటి నుంచి పారిపోయింది. 

దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేదు. దీంతో ఆ బాలిక సోదరుడు  పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో వారి గ్రామానికి చెందిన ఓ యువకుడిపై  అనుమానం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. దీంతో స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంతలో ఆ యువతి ఊహించని షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఆ యువతి టిక్కపట్టికి చెందిన అరుణ్ కుమారుడు సుధాంశు కుమార్‌తో ప్రేమ వ్యవహారం సాగిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు తన ప్రేమికుడితో కలిసి పారిపోయింది. మరోసటి రోజు పెళ్లి చేసుకుంది. ఆ ఫొటోను కుటుంబ సభ్యులకు పంపింది. అదే సమయంలో తన ప్రియుడితో కలిసి పోలీసు స్టేషన్ చేరుకుంది. తన ప్రియుడిపై పెట్టిన కిడ్నాప్ కేసును బూటకమని, తామిద్దరం ప్రేమించుకున్నామనీ, కానీ తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నామనీ, తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపారు.
 
ఈ విషయం తెలుసుకున్న సోదరుడు కోపోద్రిక్తుడయ్యాడు. తమ సోదరి చనిపోయిందని ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె దిష్టిబొమ్మను తయారు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కర్మకాండ కూడా నిర్వహించారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఎలాంటి లోటు లేకుండా తన సోదరిని పెంచుకున్నామని, తన సోదరి అంగీకారంతో ఆమె వివాహం నిశ్చయించామని తెలిపారు. కానీ.. ఊహించని విధంగా తమ ఇంటి పరువు తీసిందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని,  తన శ్రాద్ధ కర్మను కూడా పూర్తి ఆచారాలతో నిర్ణీత తేదీలో నిర్వహిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన  చర్చనీయాంశంగా మారింది.  
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?