పంజాబ్ మంత్రి పై అవినీతి ఆరోపణలు.. సీఎంకు రాజీనామా లేఖ అందజేత

Published : Jan 07, 2023, 03:52 PM IST
పంజాబ్ మంత్రి పై అవినీతి ఆరోపణలు.. సీఎంకు రాజీనామా లేఖ అందజేత

సారాంశం

పంజాబ్ మంత్రి ఫౌజా సింగ్ సరారీ రాజీనామా చేశారు. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా పేర్కొన్నారు. ఆ రాజీనామా లేఖను సీఎం భగవంత్ మాన్ సింగ్‌కు అందించారు. ఆయన ఫౌజా రాజీనామా లేఖను అంగీకరించినట్టు సమాచారం.  

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంజాబ్ హార్టికల్చర్ మినిస్టర్ ఫౌజా సింగ్ సరారీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం భగవంత్ మాన్ సింగ్‌కు అందించినట్టు తెలిసింది. తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొన్నట్టు సమాచారం. ఆ రాజీనామా లేఖను సీఎం భగవంత్ మాన్ సింగ్ అంగీకరించినట్టు తెలిసింది. కొందరు కాంట్రాక్టర్ల నుంచి డబ్బు గుంజడానికి జరిగిన ఓ డీల్‌లో అతని వాయిస్ వినిపించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆడియో క్లిప్ వైరల్ అయింది. ఈ ఎపిసోడ్ జరిగిన నెల దాటింది. తాజాగా, శనివారం ఫౌజా సింగ్ సరారీ రాజీనామా చేశారు.

మంత్రి పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు మంత్రి ఫౌజా సింగ్ సరారీ తన రిజిగ్నేషన్ లెటర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, ఒక నిజాయితీపరుడైన జవానులా పార్టీలోనే కొనసాగుతారని వివరించారు. నూతన మంత్రితో ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌లో సింపుల్ ప్రోగ్రామ్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టు తెలిసింది.

కొంతమంది కాంట్రాక్టర్లను ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ట్రాప్ చేసి వారి నుంచి డబ్బును గుంజాలనే ఓ డీల్‌కు సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ డిస్కషన్‌లో 62 ఏళ్ల ఫౌజా సింగ్ సరారీ గొంతు కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కలకలం రేగింది.

Also Read: ఆయుధంతో ఇంటర్నేషనల్ బార్డర్ దాటుతున్న పాకిస్థానీయుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్.. ఎక్కడంటే ?

ఈ ఆడియో క్లిప్‌ను ఫౌజా సింగ్ సరారీ ఫేక్ అని కొట్టిపారేశాడు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈ ఆడియో క్లిప్‌ను సృష్టించారని ఆరోపించారు.

ఫౌజా సింగ్ సరారీ రాజీనామాతో పంజాబ్ క్యాబినెట్‌లో ప్రధాన మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్