‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’.. 13 ఏళ్ల విద్యార్థినికి 47 ఏళ్ల కీచక ఉపాధ్యాయుడి ప్రేమ లేఖ

Published : Jan 07, 2023, 03:03 PM ISTUpdated : Jan 07, 2023, 04:14 PM IST
‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’.. 13 ఏళ్ల విద్యార్థినికి 47 ఏళ్ల కీచక ఉపాధ్యాయుడి ప్రేమ లేఖ

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో 47 ఏళ్ల కీచక ఉపాధ్యాయుడు 13 ఏళ్ల బాలికకు ప్రేమ లేఖ రాశాడు. సెలవులకు ముందు ఒక్కసారైనా తనను కలువాలని, తానెంతో ప్రేమిస్తున్నాని పేర్కొన్నాడు. ఆ లేఖ చదివి చింపేయాలని సూచించాడు. ఈ లేఖ తల్లిదండ్రులకు చూపెట్టడంతో నిలదీయడానికి వెళ్లారు. కానీ, క్షమాపణలు చెప్పడానికి బదులు ఆ కీచక ఉపాధ్యాయుడు వారినే బెదిరించాడు.  

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినికి ఓ 47 ఏళ్ల కీచక ఉపాధ్యాయుడు నిస్సిగ్గుగా లవ్ లెటర్ రాశాడు. అది చదివిన తర్వాత చించేయాలని అందులో సూచించాడు. ఆ లవ్ లెటర్ గురించి బాలిక తన తల్లిదండ్రులకు వివరించి చెప్పింది. దీంతో వారు ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. కానీ, తన తప్పును గురించి పశ్చాత్తాపపడకుండా ఆ బాలిక తల్లిదండ్రులనే బెదిరించాడు. ఈ ఘటన కన్నౌజ్‌లో సదర్ కొత్వాలీ పోలీసు స్టేషన్ ఏరియాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

కన్నౌజ్‌లో 47 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను ఇష్టపడుతున్నట్టు లవ్ లెటర్ రాసి ఆమె చేతిలో పెట్టాడు. సింగిల్ పేజీలో రాసిన ఈ లెటర్‌ను ఆ బాలిక తల్లిదండ్రులకు చూపెట్టడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

లవ్ లెటర్ గురించి తెలియగానే ఆ టీచర్ దగ్గరకు వెళ్లి నిలదీశానని బాలిక తండ్రి తెలిపాడు. ఆ టీచర్‌ను క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశానని వివరించాడు. కానీ, ఆ టీచర్ అందుకు నిరాకరించాడు. అంతేకాదు, తర్వాత తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఆ అమ్మాయిని కనిపించకుండా చేస్తానని బెదిరించాడు.

అమ్మాయి పేరుతో మొదలు పెట్టిన ఆ లేఖలో తాను విద్యార్థినిని ప్రేమిస్తున్నాడని, హాలీడేస్‌లో చాలా మిస్ అవుతానని పేర్కొన్నాడు. ఆ అమ్మాయిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారని రాశాడు. ఒక వేళ వీలు దొరికితే తనకు ఒక్కసారైనా కాల్ చేయాలని ఆ టీచర్ తన లేఖలో తెలిపాడు. సెలవుల కంటే ముందు ఒక్కసారైనా తనను కలువాలని, ఆమె తనను నిజంగా ప్రేమిస్తే తప్పకుండా తనను కలవడానికి వస్తుందని రాశాడు. ఈ లేఖను చదివిన తర్వాత చింపేయాలని సూచించాడు.

పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్పీ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. దర్ాయప్తు ప్రారంభించామని వివరించారు. తాము కూడా ఒక టీమ్ ఏర్పాటు చేశామని, దీనిపై నివేదిక కోరామని, ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కౌస్తుబ్ సింగ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌