88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.. ఆ డబ్బుతో ఏం చేస్తాడంటే?

By Mahesh KFirst Published Jan 20, 2023, 2:29 PM IST
Highlights

పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి 88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అందులో 30 శాతం పన్ను పోతే రూ. 3.5 కోట్లు ఆయన పొందనున్నాడు. ఆ డబ్బును తన ఇద్దరు కొడుకులు, డేరాకు పంచి పెడతానని వివరించాడు.
 

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన 88 ఏళ్ల మహంత్ ద్వారకా దాస్‌కు లక్కి లాటరీ తగిలింది. లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్ లాటరీ ప్రథమ విజేతగా నిలిచారు. దీంతో ఆయన రూ. 5 కోట్ల లాటరీని సొంతం చేసుకున్నారు. ఈ వార్త ఆయన జీవితాన్ని మొత్తంగా మార్చేసింది. ఆయన నివసిస్తున్న ప్రాంతమంతా సంబురాల్లో మునిగిపోయింది. కొందరైతే ఆమెకు పూల మాలలు వేసి అభినందనలు తెలిపారు.

పంజాబ్‌లోని డేరా బస్సీలో త్రివేది క్యాంప్‌నకు చెందిన మహంత్ ద్వారకా దాస్ తన 88 ఏళ్ల లేటు వయసులో లాటరీ గెలుచుకున్నారు. ఈ డబ్బును ఏం చేయబోతున్నారనే విషయంపైనా ఆయన స్పందించారు. తాను తరుచూ లాటరీ టికెట్లు కొనేవాడని తెలిపారు. గత 35 నుంచి 40 ఏళ్లుగా ఆయన లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నారని వివరించారు. తాను లాటరీ గెలుచుకోవడంపై సంతోషంగా ఉన్నారని చెప్పారు. తాను గెలుచుకున్న మొత్తాన్ని తన ఇద్దరు కొడుకులకు, డేరాకు పంచి ఇస్తానని వివరించారు.

Also Read: జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడికి దుబాయిలో 30 కోట్లు లాటరీ తగిలింది (వీడియో)

ఆయన కొడుకు నరేంద్ర కుమార్ శర్మ మాట్లాడుతూ తన తండ్రి బంధువుకు డబ్బు ఇస్తే లాటరీ కొనుగోలు చేశాడని వివరించారు. ఆయన ఈ డబ్బు గెలుచుకున్నాడని, తాను సంతోషంగా ఉన్నారని వివరించారు. 

జిరక్‌పూర్‌లో లాటరీ వ్యాపారం నడుపుతున్న లోకేశ్ ఆ కుటుంబానికి లాటరీ టికెట్ అమ్మాడని వివరించారు. ద్వారకా దాస్ పన్నుల కటింగ్ తర్వాత రూ. 3.5 కోట్ల డబ్బును పొందుతారని తెలిపారు. రూ. 5 కోట్ల పై 30 శాతం పన్ను విధిస్తారని, ఆ పన్ను డబ్బు కట్ చేసుకుని మిగితా డబ్బు ఇస్తారని కరమ్ సింగ్ అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ వివరించారు.

click me!