ట్రీట్‌మెంట్ కోసం పోలీసు అధికారి వేడుకోలు: దిగొచ్చిన ప్రభుత్వం

Published : Jun 04, 2021, 02:06 PM IST
ట్రీట్‌మెంట్ కోసం పోలీసు అధికారి వేడుకోలు: దిగొచ్చిన ప్రభుత్వం

సారాంశం

 డిప్యూటీ జైలు సూపరింటెండ్ గా పని చేస్తున్న  49 ఏళ్ల హర్జిందర్ సింగ్  తన ట్రీట్ మెంట్ కోసం ఆర్ధిక సహాయం ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వం తీరును విపక్షాలు ఎండగట్టాయి.

చంఢీఘడ్: డిప్యూటీ జైలు సూపరింటెండ్ గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్ సింగ్  తన ట్రీట్ మెంట్ కోసం ఆర్ధిక సహాయం ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వం తీరును విపక్షాలు ఎండగట్టాయి.

హర్జిందర్ సింగ్ కు ఇటీవలనే కరోనా సోకింది. కరోనా నుండి ఆయన కోలుకొన్నారు. అయితే ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. దీంతో లూథియానాలోని ఆసుపత్రిలో చేరాడు. లంగ్స్ మార్చాలని వైద్యులు తేల్చి చెప్పారు. లంగ్స్ మార్చేందుకు భారీగా డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన తనకు ఆర్ధిక సహాయం చేయాలని ఆయన కోరారు.

అంత పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించడం సాధ్యం కాదని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది. తాను చనిపోయిన తర్వాత తన కుటుంబంలో ఇచ్చే ఉద్యోగం పరిహారం బదులుగా తనకు బతికే అవకాశం కల్పించాలని హర్జిందర్ సింగ్ కోరాడు. ఈ మేరకు ఆయన వీడియోను పోస్ట్ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

భార్యతో తెగదెంపులు చేసుకొని వెళ్లడంతో ముగ్గురు పిల్లల బాధ్యత కూడ ఆయనపై ఉంది. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం రూ. 80 లక్షల వరకు ఖర్చు అవుతోంది.  అయితే పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే  పోలీసు శాఖ రూ. 50 లక్షల పరిహారం చెల్లించనుంది. 

హర్జిందర్ సింగ్ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. సింగ్ ట్రీట్ మెంట్ కు అవసరమైన డబ్బులను భరిస్తామని ప్రభుత్వం ప్రకరటించింది. లూథియానాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ, హైద్రాబాద్ లేదా చెన్నైలలోని ఆసుపత్రుల్లో లంగ్స్ ట్రాన్స్‌ఫ్లాంటేషన్ చేయిస్తామని ప్రభుత్వం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం