మురికిగా ఉన్న హాస్పిటల్ బెడ్‌పై పడుకోమని అధికారిని ఆదేశించిన ఆరోగ్య మంత్రి.. (వీడియో)

Published : Jul 30, 2022, 04:27 AM IST
మురికిగా ఉన్న హాస్పిటల్ బెడ్‌పై పడుకోమని అధికారిని ఆదేశించిన ఆరోగ్య మంత్రి.. (వీడియో)

సారాంశం

పంజాబ్ మంత్రి ఓ హాస్పిటల్‌లో తనిఖీలు చేస్తూ అక్కడి అధికారుల పట్ల వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది. బెడ్లు మురికిగా ఉన్నాయని పేర్కొంటూ వాటిపై పడుకోని చూపెట్టాలని ఆదేశించారు. దీంతో ఆ ఉన్నత అధికారి బెడ్ పై పడుకుని చూపించారు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది.  

న్యూఢిల్లీ: పంజాబ్ ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా ఓ హాస్పిటల్‌లో తనిఖీలు చేయడానికి వెళ్లారు. పేషెంట్ల నుంచి నేరుగా సమస్యలు విన్నారు. పేషెంట్లు పలు అంశాలపై ఫిర్యాదు ఇచ్చారు. అందులో ఒకటి.. బెడ్‌లు మురికిగా ఉంటున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి నేరుగా హాస్పిటల్ ఉన్నత అధికారుల ముందు ఉంచారు. అంతేకాదు, తమ ముందే ఓ బెడ్ పై పడుకోవాలని ఆదేశించారు. మరో అవకాశం లేకుండా పోయిన ఆ అధికారి అందరి ముందు ఆ బెడ్‌పై పడుకుని చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు అయింది. కాగా, ఈ విషయమై ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఫైర్ అయింది.

రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ను ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా వెళ్లి పరిశీలించారు. ఈ పరిశీలనలో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సెలర్ డాక్టర్ రాజ్ బహదూర్ వెంటే ఉన్నారు. హాస్పిటల్‌లో బెడ్లు మురికిగా ఉంటున్నాయని మంత్రి తెలిపారు. పడకలు పడుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అందుకు ఉన్నాయని వైస్ చాన్సెలర్ డాక్టర్ రాజ్ బహదూర్ అన్నారు. అలాగైతే.. ఒక సారి పడుకోని చూపించాలని కోరారు. నిజంగానే పడుకోమంటుండనే విషయాన్ని తొలుత వైస్ చాన్సెలర్ డాక్టర్ రాజ్ బహదూర్‌కు అర్థం కాలేదు. ఆ తర్వాత వెళ్లి బెడ్ పై ఒరిగి లేచి వచ్చాడు. ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇదంతా మీ చేతుల్లోనే ఉన్నది అంటూ మంత్రి ఆయనకు తెలిపారు.

ఆయన బెడ్ పై నుంచి లేచిన తర్వాత మ్యాట్రెస్‌ను లేపి చూపెడుతూ కింద బాగా లేదని ఇతరులు లేవనెత్తారు. దీంతో తనకు స్టోర్స్ చూపించాలని మంత్రి అన్నారు.

మంత్రి వ్యవహారంపై వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవి తాము అందించే సేవలు నైతికంగా తమపై ప్రభావం వేస్తాయని పేర్కొన్నారు. బహిరంగంగా తమను అవమానించినట్టే అని తెలిపారు.

కాగా, కాంగ్రెస్ కూడా అధికారిక పార్టీపై మండిపడింది. ఆప్ చేసే ఈ నాటకాలు ఎన్నటికీ ముగిసేలా లేవని పేర్కొంది. ఇలాంటి ఘటనలు మెడికల్ స్టాఫ్‌ను డిమోరలైజ్ చేస్తుందని కాంగ్రెస్ నేత పరాగత్ సింగ్ ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?