భూమిలోంచి నీటిని తోడితే పన్ను , పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

By Siva KodatiFirst Published Jan 29, 2023, 2:38 PM IST
Highlights

పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై భూమిలోంచి నీటిని తోడితే పన్ను విధిస్తామని తెలిపింది. పంజాబ్‌లో భూగర్భ జలవనరులు నానాటికీ అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే భగవంత్ మాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 

రైతులకు ఇతర వర్గాలకు పంజాబ్‌లోని భగవంత్ మాన్ సర్కార్ షాకిచ్చింది. భూమిలోంచి నీటిని తోడితే పన్ను విధిస్తామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. భూగర్భ జలాన్ని కాపాడేందుకు వీలుగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజలకు ఈ విషయంలో చిన్న వెసులుబాటు కల్పించింది సర్కార్. వ్యవసాయానికి, ఇంటి తాగునీటి అవసరాలకు వినియోగిస్తే ఎలాంటి పన్ను విధించబోమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. 

అలాగే ప్రభుత్వ నటి పంపిణీ పథకాలు, సైనిక బలగాలు, పుర, నగర పాలక, పంచాయతీ రాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, అభివృద్ధి మండళ్లు, ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపు కల్పించారు. మిగిలిన వారు మాత్రం భూగర్భ జలాల్ని వాడుకునేందుకు ప్రభుత్వానిక దరఖాస్తు పెట్టుకోవాల్సి వుంటుంది. పంజాబ్‌లో భూగర్భ జలవనరులు నానాటికీ అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే భగవంత్ మాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 

ALso REad: గన్ కల్చర్ పై పంజాబ్ సర్కార్ కఠిన చర్యలు.. ఇకపై అలా చేస్తే జైలుకే..

ఇదిలావుండగా రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్, గన్ కల్చర్‌పైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయుధాల కొనుగోలు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆయుధాల బహిరంగ ప్రదర్శనను నిషేధించడంతో సహా తుపాకీ యాజమాన్యం, ప్రదర్శనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే.. ఆయుధాలు లేదా హింసను కీర్తిస్తూ పాడే పాటలను నిషేధం విధించింది. అలాగే.. వ్యక్తిగతంగా ఆయుధాల లైసెన్స్ కూడా అంత తేలికగా లభించదు. దీనికి సంబంధించి పలు నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్ చెకింగ్ జరుగుతుంది. 

తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించే పాటలు, సాహిత్యంపై నిషేధం విధించింది. అటువంటి ధోరణిని ప్రోత్సహించడాన్ని పూర్తి నిషేధించింది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.గతంలో కొందరు పంజాబీ గాయకులు తుపాకీ సంస్కృతినీ,గూండాయిజం ప్రోత్సహించే పాటను నిషేధం విధించింది. సమాజంలో హింస, ద్వేషం, శత్రుత్వాన్ని పెంచుకోవడం మానుకోవాలని వారిని ప్రభుత్వం ఆదేశించింది.గత సంవత్సరం ప్రారంభంలో గన్ కల్చర్ ప్రోత్సహించే విధంగా  పాటలు పాడారని పంజాబీ గాయకుడు శ్రీ బ్రార్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 

click me!