Punjab election 2022: సోదరి కోసం డబ్బులు పంచుతున్నారు.. ఆప్ ఆరోపణలు, సోనూసూద్‌ కారు సీజ్

Siva Kodati |  
Published : Feb 20, 2022, 02:31 PM IST
Punjab election 2022: సోదరి కోసం డబ్బులు పంచుతున్నారు.. ఆప్ ఆరోపణలు, సోనూసూద్‌ కారు సీజ్

సారాంశం

పంజాబ్ ఎన్నికల వేళ.. నిబంధనలు ఉల్లంఘించారని సినీనటుడు సోనూసూద్‌పై (sonu sood) చర్యలు తీసుకున్నారు ఎన్నికల అధికారులు. సోనూసూద్ పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సోనూసూద్‌పై పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా నిషేధం విధించారు అధికారులు.

పంజాబ్ ఎన్నికల వేళ.. నిబంధనలు ఉల్లంఘించారని సినీనటుడు సోనూసూద్‌పై (sonu sood) చర్యలు తీసుకున్నారు ఎన్నికల అధికారులు. పంజాబ్‌లో మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా (congress) బరిలోకి దిగారు సోనూసూద్ సోదరి. అయితే సోనూసూద్ పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. అధికారులకు ఫిర్యాదు అందింది. అతను ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు ఆప్ నేతలు. దీంతో సోనూసూద్‌పై పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా నిషేధం విధించారు అధికారులు. అతని కారును కూడా సీజ్ చేశారు. 

కాగా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Election 2022) పోలింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. ఈ ఎన్నికల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. అయితే పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. అయితే పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరంగా మారాయి.

మరో గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో..  ప్రస్తుతం సీఎం చరణ్​జిత్​సింగ్​ చన్నీ, ఆప్​ సీఎం అభ్యర్థి​ భగవంత్​ మాన్​, పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ సిద్దు, మాజీ సీఎంలు అమరీందర్ సింగ్​​, ప్రకాశ్​ సింగ్​ బాదల్​, రాజిందర్ కౌర్ భట్టల్, శిరోమణి అకాలీదళ్​ అధ్యక్షుడు​ సుఖ్​బీర్​సింగ్​ బాదల్, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ,  కేంద్ర మాజీ మంత్రి విజయ్ సంప్లా వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !