Punjab Elections 2022: ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుంది: అమరీందర్ సింగ్

Published : Feb 20, 2022, 02:30 PM IST
Punjab Elections 2022: ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుంది: అమరీందర్ సింగ్

సారాంశం

Punjab Elections 2022: పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పాటియాలా నియోజకవర్గం నుంచి తాను గెలిచి తీరుతానని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీ విజయం సాధిస్తుంద‌ని  కెప్టెన్ అమరీందర్ సింగ్ దీమా వ్య‌క్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక లోకంలో విహరిస్తోందని, ఆ పార్టీ పంజాబ్‌లో తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు.   

Punjab Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు చాలా ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌లను సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్టంలో నేడు పంజాబ్ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఆస‌క్తిక‌రంగా పోలింగ్ స్టేష‌న్లు త‌ర‌లివ‌స్తున్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌ బారులు తీరారు. పంజాబ్‌లోని  మొత్తం 117  అసెంబ్లీ స్థానాలున్నాయి. 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  దీంతో పంజాబ్‌లోని 2.14 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.  

ఈ త‌రుణంలో మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పాటియాలా నియోజకవర్గం నుంచి తాను గెలిచి తీరుతానని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీ విజయం సాధిస్తుంద‌ని  కెప్టెన్ అమరీందర్ సింగ్ దీమా వ్య‌క్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక లోకంలో విహరిస్తోందని, ఆ పార్టీ పంజాబ్‌లో తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. 

మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఆప్, కాంగ్రెస్‌, SAD అభ్యర్థుల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశముంది. 2017లో కాంగ్రెస్ టిక్కెట్‌పై 52,000 కంటే ఎక్కువ ఓట్లతో AAPకి చెందిన డాక్టర్ బల్బీర్ సింగ్‌పై విజయం సాధించారు.

గత ఏడాది..పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు రావ‌డంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని  ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు తన ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ, తనకు ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ..తాము విజ‌యం సాధిస్తే.. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని శిరోమోని అకాలీదళ్ (ఎస్‌ఎడి) నాయకుడు గుర్బచన్ సింగ్ సూచనప్రాయంగా తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  "మేము విజయంపై నమ్మకంతో ఉన్నాం. పంజాబ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని అకాలీదళ్-బిఎస్‌పి ఏర్పాటు చేస్తుంది. మాకు సంఖ్యాబలం తగ్గితే బిజెపి మద్దతు తీసుకోవాలని పార్టీ నిర్ణయిస్తుంది. అది మ్యాజిక్ ఫిగ‌ర్ పై ఆధారపడి ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ మాత్రం త‌మ‌కు నెం.1 శత్రువు అని అన్నారు. 

మ‌రో వైపు ఉత్తర ప్రదేశ్‌లో మూడో విడత పోలింగ్ ఆదివారంనాడు పోలింగ్ జరగుతుంది.  ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు మూడో దశలో పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

PREV
click me!

Recommended Stories

Delhi Malviya Nagar Fire Incident: ఢిల్లీలోని మాల్వీయా నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం... | Asianet Telugu
కర్ణాటక సీఎం గా డికె శివకుమార్ ప్రమాణ స్వీకారం | D.K. Shivakumar Takes Oath | Asianet News Telugu