
చండీగడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సంచలన ఆరోపణలు చేశారు. ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా.. ఆయన అటు బీజేపీ, ఇటు అకాలీదళ్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం బయటపడిందని ట్వీట్ చేశారు. బీజేపీ, అకాలీ దళ్ పార్టీలు డేరా సచ్చా సౌదా మద్దతు తీసుకుంటున్నారని ఆరోపణలు సంధించారు.
చన్నీ తన ట్విట్టర్ అకౌంట్‌లో.. ‘అకాలీ, బీజేపీల భాగస్వామ్యం ఇప్పుడు బయటపడింది. ఆ రెండు పార్టీలు డేరా సచ్చా సౌదా మద్దతు తీసుకుంటున్నాయి. వారు ఒక్కటిగా జట్టు కట్టనివ్వండి.. పంజాబ్ ప్రజలు కూడా వారికి వ్యతిరేకంగా జట్టు కడతారు. వారి ఓట్లతో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు, అదే సమయంలో భగవంత్ సింగ్ మన్, ఆప్‌లపైనా ఆరోపణలు చేశారు. వారు కూడా ధూరిలో డేరా మద్దతు తీసుకుంటున్నారని తెలిపారు.
బీజేపీ నేతలను ఉద్దేశించి పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ చేసినా..యుపి, బీహార్ కే భయ్యా వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి.
చన్నీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఘాటూగా విమర్శించారు. చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని ప్రియాంక గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. తనకు తాను యూపీ కూతురిగా చెప్పుకొంటారని చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని విమర్శించారు. పంజాబేతరులైన సంత్ రవిదాస్, గురు గోవింద్ సింగ్‌లను అవమానించారంటూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం మాటల దాడికి దిగారు.
'యుపి, బీహార్ కే భయ్యా' వ్యాఖ్యను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా పంజాబేతరులైన సంత్ రవిదాస్, గురు గోవింద్ సింగ్‌లను అవమానించారంటూ ఆరోపించారు.ప్రాంతీయత ఆధారంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఇలా.. సీఎం చన్నీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దూమారం రేగడంతో.. చన్నీ వ్యాఖ్యలను సరిదిద్దేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రయత్నించారు.
చన్నీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సమర్ధించారు. పంజాబ్‌ను పంజాబీలు మాత్రమే పాలించాలనే ఉద్దేశంలో చన్నీ అలా మాట్లాడరనీ, కానీ ఆయన మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. UP నుండి అయినా బిహార్ నుంచి అయినా ఇంకెక్కడి నుంచైనా పంజాబ్‌కు రావొచ్చునని అన్నారు. కానీ పంజాబ్ పాలించాలని యూపీ నేతలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.