Punjab Election 2022: సోనూసూద్ కు ఈసీ షాక్.. కారు సీజ్‌ చేసిన పోలీసులు

Published : Feb 20, 2022, 03:30 PM IST
Punjab Election 2022: సోనూసూద్ కు ఈసీ షాక్.. కారు సీజ్‌ చేసిన పోలీసులు

సారాంశం

Punjab Election 2022:  బాలీవుడ్‌ నటుడు సోనూసూద్ (Sonu Sood)ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. సోనూ సూద్‌ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆదివారం పంజాబ్‌లో పోలింగ్‌ నేపథ్యంలో మోగాలోని పలు పోలింగ్‌ బూత్‌లను సందర్శించేందుకు సోనూ సూద్‌ కారులో బయలుదేరారు.  

Punjab Election 2022: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్ (Sonu Sood)కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో లంధేకే గ్రామం పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్(EC) అడ్డుకుంది. సోనూసూద్ కారును స్వాధీనం చేసుకుని.. ఆయన్ను ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటికొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం. 

సోనూసూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పంజాబ్ లోని మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచింది. దీంతో ఆ నియోజ‌క వ‌ర్గంలో ఎన్నికల‌ను పరిశీలించేందుకు అక్క‌డ వెళ్లారు. సోనూసూద్‌. ఐతే పోలింగ్‌ బూత్‌లోకి ఇతరులకు ఎంట్రీ లేదంటూ అడ్డుకున్నారు.  ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవద్దని ఆదేశించింది. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, SDM-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. సత్వంత్ సింగ్ మాట్లాడుతూ.. “సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు హ‌క్కు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి అనుమతించలేద‌నీ, అతని ఇంట్లోనే ఉండాలని ఆదేశించమ‌ని. అయితే.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించాడనీ, అందువల్ల,  అతని ఇంటిపై వీడియో నిఘా ఉంచాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిపారు.

ఈ విష‌యంపై సోనుసూద్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు ఓట్లను కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ త‌న‌పై తప్పుడు ఫిర్యాదు చేశారనీ, ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమేన‌నీ, వాహనం సరిగ్గా పార్క్ చేయలేదని చెప్పుకొచ్చారు. మోగా నియోజకవర్గంలో ఇతర పార్టీల అభ్యర్థులు ఓట్లను కొంటున్నారని సోనూసూద్ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని  ఓ ట్వీట్‌లో ఆరోపించారు. ఈ ట్వీట్‌ను మోగా ప్రజా సంబంధాల అధికారికి, పోలీసులకు ట్యాగ్ చేశారు.
 
 సోనూ సూద్ కారును స్వాధీనం చేసుకోవ‌డంపై ఆ జిల్లా కలెక్టర్ హరీశ్ నయ్యర్ స్పందించారు.ఆయన ఓటర్లను ప్రభావితం చేశారా? అనే అంశంపై నివేదికను సమర్పించాలని మోగా ఎస్ఎస్‌పీని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ నయ్యర్ చెప్పారు. ఆయన ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కు వెళ్తున్నారని.. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు.

సోనూ సూద్ సోదరి మావికా సూద్ మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. 

 ఇదిలా ఉంటే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు)లో సాంకేతిక లోపం కారణంగా మోగా జిల్లాలోని నాలుగు బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. బాఘపురానా నియోజకవర్గంలోని బూత్ నంబర్ 198, నిహాల్ సింగ్ వాలా నియోజకవర్గంలోని 13వ నంబర్, మోగా నియోజకవర్గంలోని బూత్ నంబర్లు 160 మరియు 161లో ఓటింగ్ ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.

ఈ త‌రుణంలో అకాలీ అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అకాలీ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, కాంగ్రెస్ నాయకుడు అమ్రిష్ బగ్గా మోగాలోని B.Ed కళాశాల సమీపంలో మాజీ కౌన్సిలర్ మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను శాంతింపజేశారు.

PREV
click me!

Recommended Stories

PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?