Punjab Assembly Election Result 2022: పంజాబ్ లో ప్రధాన పార్టీలను ఊడ్చేసిన 'ఆప్'

Published : Mar 10, 2022, 11:50 AM IST
Punjab Assembly Election Result 2022: పంజాబ్ లో ప్రధాన పార్టీలను ఊడ్చేసిన 'ఆప్'

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి ఆప్ అధికారం వైపునకు దూసుకెళ్తోంది. ఢిల్లీలో ఆప్ పాలన ప్రభావం పంజాబ్ పై తీవ్ర ప్రభావం చూపింది.

చండీఘడ్: Punjab  రాష్ట్రంలో ప్రధాన పార్టీలను AAP ఊడ్చేసింది. ఎన్నికలకు ముందు నుండే పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థల సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇవాళ ఎన్నికల ఫలితాల సరళి కూడా అందుకు తగ్గట్టుగా ఉంది.

Delhiకి అనుకొని ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్నికల ఫలితాలు  వస్తున్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ నేతృత్వంలోని పాలన ప్రభావం పంజాబ్ పై కన్పించింది. మరో వైపు గత ఐదేళ్లలో Congress పార్టీ పాలనతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడానికి కారణంగా రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.

 గత ఎన్నికల సమయంలో కెప్టెన్ Amarinder Singh కాంగ్రెస్ పార్టీని పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరీందర్ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.  ఎన్నికల ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరిన Navjot Singh Sidhu కూడా అమరీందర్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగాడు.  అమరీందర్ సింగ్  ప్రజలకు దూరంగా ఉంటారనే ప్రచారం కూడా లేకపోలేదు. మరో వైపు  సిద్దూకు, అమరీందర్ సింగ్ కు మధ్య విబేధాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 

అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుండి తప్పించారు. ఆయన స్థానంలో Channiని సీఎంగా కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టింది. నవజ్యోత్ సింగ్ సిద్దూకు పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చింది. దళిత ఓటర్లను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయోగం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం పలితం ఇవ్వలేదు.అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారు.సిద్దూ ఒంటెత్తు పోకడలు, అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టడం వంటి పరిణామాలు కూడా కాంగ్రెస్ ను నష్టపర్చాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

గత కొంత కాలంగా రాష్ట్రంలో  Shiromani Akali Dal కూడా ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి, NDA నుండి అకాలీదళ్ బయటకు వచ్చింది. అయినా కూడా ఓటర్లు ఆ పార్టీ వైపునకు మొగ్గు చూపలేదు.ఈ ఎన్నికల్లో BSP తో అకాలీదళ్ పొత్తు పెట్టుకొంది. 

మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో పొత్తు పెట్టుకొన్న బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పంజాబ్ రాష్ట్రంపై కేంద్రీకరించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఆప్ పై వ్యతిరేక ప్రచారం చేసినా కూడా ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలను వెనక్కి ఊడ్చేసి ఆప్ అధికారం వైపునకు దూసుకెళ్లింది.

పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అత్యధిక స్థానాల్లో  ఆధిక్యంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ సీఎం అభ్యర్ధిపై కొంత వ్యతిరేక ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఓటర్లు ఆప్ వైపే మొగ్గు చూపారు. దీనికి ఢిల్లీ  పాలన ప్రభావం కన్పించింది. ఆప్ తర్వాత కాంగ్రెస్ నిలిచింది. పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ సీఎంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమయింది.  పంజాబ్ విషయానికి వస్తే ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.

పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్​ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 77 సీట్లలో, ఆప్​ 20 చోట్ల గెలిచింది. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో..  ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చౌమ్‌కౌర్ సాహిబ్, Bhadaur రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు. పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్‌సర్ ఈస్ట్, మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పటియాలా, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్, ఆప్​ సీఎం అభ్యర్థి Bhagwant Mann.. ధురి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబి, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ.. పఠాన్‌కోట్ స్థానాల నుంచి ఎన్నిక బరిలో నిలిచారు.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu