భర్త ఊరెళ్లి పోదామన్నాడని.. ఏడాదిన్నర బిడ్డతో సహా భార్య ఆత్మహత్య...

By AN TeluguFirst Published Oct 9, 2020, 2:50 PM IST
Highlights

లాక్ డౌన్ తో ఉద్యోగం పోయి, సొంతూరుకు వెళ్లిపోదామని భర్త అన్నాడని,  ఇష్టం లేక కూతురుని చంపి తానూ చనిపోయిందో మహిళ. షాకింగ్ గా అనిపించే ఈ విషాద సంఘటన మహారాష్ట్రలో జరిగింది. 

లాక్ డౌన్ తో ఉద్యోగం పోయి, సొంతూరుకు వెళ్లిపోదామని భర్త అన్నాడని,  ఇష్టం లేక కూతురుని చంపి తానూ చనిపోయిందో మహిళ. షాకింగ్ గా అనిపించే ఈ విషాద సంఘటన మహారాష్ట్రలో జరిగింది. 

పూణె శివారు రాజ్‌గురునగర్‌ పరిధిలోని రక్షేవాడిలో నివాసముంటున్న అంకిత్(28), యోగితా బాగల్(32) భార్యాభర్తలు. వారికి ఏడాదిన్నర పాప కావ్య ఉంది. అంకిత్ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా  కొద్దినెలలుగా ఉద్యోగం పోయి ఖాళీగానే ఉంటున్నాడు.

దీంతో ఉన్న ఉద్యోగం పోయి, కొత్త ఉద్యోగం దొరికే అవకాశం లేక సొంతూరికి వెళ్లి పోదామని నిశ్చయించుకన్నాడు అంకిత్. ఇదే విషయం భార్యతో చెప్పాడు. అయితే దీనికి యోగితా అస్సలు ఒప్పుకోలేదు. భర్త ఇంట్లో లేని సమయంలో ఏడాదిన్నర కూతురిని చంపేసి.. తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఊరు నుంచి తిరిగొచ్చిన అంకిత్ తలుపు తట్టినా భార్య తీయలేదు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి తల్లీబిడ్డ ఉరికి వేలాడుతూ కనిపించారు. 

చిన్నారికి ఉరి బిగించి చంపేసి.. ఆ తరువాత తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సొంతూరు వెళ్లిపోవడం ఇష్టం లేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
 

click me!