ఎమ్మెల్యే ప్రేమ వివాహం : కోర్టు ముందుకు సౌందర్య...

Bukka Sumabala   | Asianet News
Published : Oct 09, 2020, 01:06 PM IST
ఎమ్మెల్యే ప్రేమ వివాహం : కోర్టు ముందుకు సౌందర్య...

సారాంశం

ర‌హ‌స్యంగా ప్రేమ వివాహం చేసుకున్న త‌మిళ‌నాడు అధికార అన్నాడీంకే ఎమ్మెల్యే ప్ర‌భు తన భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు అంగీకరించారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని ప్రకటించారు. కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు త్యాగదుర్గం మలయమ్మన్‌ ఆలయ అర్చకుడు స్వామినాథన్‌ కుమార్తె సౌందర్యను సోమవారం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ వివాహం బెదిరింపుల మధ్య జరిగినట్టు, తన కుమార్తెను కిడ్నాప్‌ చేసినట్టు సౌందర్య తండ్రి స్వామినాథన్‌ ఆరోపించారు. ఈ మేరకు కోర్టుకు కూడా వెళ్లాడు.  తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని, ఇందులో ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్‌లు లేవు అని స్వామినాథన్ కుమార్తె సౌందర్య ప్రకటించింది. 

అయినా స్వామినాథన్ పట్టువదలలేదు. తన కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకున్నారని, రక్షించాలని కోరుతూ స్వామినాథన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.  పిటిషనర్‌ వాదనను విన్న కోర్టు, సౌందర్యను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.  

కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యే ప్రభు స్పందించారు. భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమేనని, శుక్రవారం కోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. తన మామతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ ఆయన పట్టువదలడం లేదన్నారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నామని, దీనిని ఆయన రాద్ధాంతం చేయడం విచారకరంగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని, భార్యను కోర్టులో హాజరు పరుస్తానని పేర్కొన్నారు.   

త‌మిళ‌నాడులో అధికార అన్నాడీంకే ఎమ్మెల్యే ప్ర‌భు (35) ర‌హ‌స్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విల్లుపురం జిల్లాలోని తియ‌గ‌దురుగ‌మ్ ప‌ట్టణానికి చెందిన ప్ర‌భు అదే ప‌ట్ట‌ణానికి చెందిన సౌంద‌ర్య (19) గ‌త నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సౌంద‌ర్య తండ్రి స్వామినాథ‌న్ (48), ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు‌ వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బీఏ సెకండియ‌ర్ విద్యార్థిని అయిన‌ సౌంద‌ర్య‌ ఆదివారం ఉద‌యం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయింది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu
Nirmala Sitharaman: యోగాలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ | Asianet News Telugu