
మహారాష్ట్రలోని పూణెలో ఓ వైద్యుడు తన కుటుంబాన్ని మొత్తం హత్య చేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని వర్వాండ్ గ్రామంలో వెలుగు చూసింది. ఓ చిన్న విషయంలో గొడవపడిన వెటర్నరీ డాక్టర్ అతుల్ దివేకర్ తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను బావిలో పడే.. చంపేశాడు. ముగ్గురిని చంపిన తర్వాత డాక్టర్ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో బావిలో పడేసిన పిల్లలను వెతికే పని కూడా సాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల పేర్లు అతుల్ దివేకర్, పల్లవి దివేకర్, అదివత్ దివేకర్, వేదాంతి దివేకర్. అతుల్ దివేకర్ వెటర్నరీ డాక్టర్ , అతని భార్య టీచర్.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.