మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు.. అసలేం జరిగింది?

Published : Jun 21, 2023, 04:26 AM IST
మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు..   అసలేం జరిగింది?

సారాంశం

 మరోసారి ఇంటర్నెట్ నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని జూన్ 25 వరకు పొడిగించింది. 

హింసాత్మక మణిపూర్‌లో ఉగ్రవాద సంస్థ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్)కు చెందిన నలుగురు అనుమానిత సభ్యులను అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం.. నాలుగు క్యాడర్ల నుండి ఒక 51 ఎంఎం మోర్టార్, ఒక యాంటీ పర్సనల్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా జూన్ 19 రాత్రి పోలీస్ స్టేషన్ లిలాంగ్ సమీపంలో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయబడింది. రెండు వేర్వేరు వాహనాల్లో 51 ఎంఎం మోర్టార్‌తో పాటు నలుగురు అనుమానిత క్యాడర్‌లను అరెస్టు చేశారు. నలుగురినీ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

గతంలో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సోమవారం తీవ్ర స్వరంతో తిరుగుబాటుదారులను హెచ్చరించారు. హింసను తక్షణం ఆపండి, లేదంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. హింసను ఏ రూపంలోనూ సహించబోమన్నారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఆయన త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హింసాత్మక మణిపూర్ ముఖ్యమంత్రి తిరుగుబాటుదారులకు ఇలా హెచ్చరిక చేయడం ఇదే తొలిసారి. ఆదివారం రాత్రి ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో దుండగులు జరిపిన ఆకస్మిక కాల్పుల్లో జవాన్ గాయపడటంపై ఆయన స్పందించారు.

ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు

మణిపూర్‌లో మంగళవారం  ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని జూన్ 25 వరకు ( ఐదు రోజుల పాటు) పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించారు. మే 3న మణిపూర్‌లో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది.

మణిపూర్‌లో రథయాత్ర ఉత్సవం, భక్తులు శాంతి 

మణిపూర్‌లో మంగళవారం భిన్నమైన వాతావరణం కనిపించింది. నిస్పృహలో మునిగిన ప్రజలకు ఇది ఖచ్చితంగా ఆశాకిరణం లాంటిది. ఇక్కడ వందలాది మంది జగన్నాథ భక్తులు 'రథయాత్ర' సందర్భంగా ప్రార్థనలు చేశారు. మణిపూర్‌లో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని భక్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్యాలెస్ కాంపౌండ్‌లోని గోవింద్‌జీ ఆలయానికి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. మణిపూర్‌లో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా రథయాత్ర ఉత్సవం ఆ వైభవంగా జరుపుకోలేదు. రథయాత్రలో కేవలం పూజలు మాత్రమే జరిగాయి, రథాన్ని లాగలేదు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !