
జర్నలిజం, సాహిత్యం, నాటకం, సంగీత రంగాలలో పులిట్జర్ ప్రైజ్ 2022 విజేతలను సోమవారం ప్రకటించారు. జర్నలిజం విజేతల జాబితాలో భారతీయులు అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ డేవ్‌లతో పాటు దివంగత డానిష్ సిద్దిఖీలు ఉన్నారు. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ డానిష్ సిద్ధిఖీకి మరణాంతరం ఈ అవార్డు లభించింది. గత ఏడాది ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలు, తాలిబాన్ తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఘర్షణను కవర్ చేస్తూ సిద్ధిఖీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశంలో కోవిడ్ పరిస్థితులకు సంబంధించిన చిత్రాలకు గానూ అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ డేవ్‌లతో పాటు డానిష్ సిద్దిఖీకి.. పులిట్జర్ అవార్డు లభించింది. వీరు ముగ్గురు కూడా రాయిటర్స్ వార్త సంస్థలో ఫొటోగ్రాపర్స్‌గా ఉన్నారు. ఇక, ఉక్రెయిన్‌కు చెందిన జర్నలిస్టులు 2022 పులిట్జర్ ప్రైజ్ ప్రత్యేక ఉల్లేఖనతో గుర్తించబడ్డారు.
డానిష్ సిద్ధిఖీ
సిద్ధిఖీ రాయిటర్స్‌కి చీఫ్ ఫోటోగ్రాఫర్. సిద్దిఖీ టీవీ టుడే నెట్‌వర్క్, హిందుస్థాన్ టైమ్స్‌కు కరస్పాండెంట్‌గా పనిచేశారు. పులిట్జర్ ప్రైజ్ గెలవడం సిద్దిఖీకి ఇది రెండోసారి. రోహింగ్యా సంక్షోభంపై కవరేజ్ చేసినందుకు రాయిటర్స్ బృందంలో భాగంగా 2018లో అతనికి ఈ అవార్డు లభించింది. అతను ఆఫ్ఘనిస్తాన్ వివాదం, హాంకాంగ్ నిరసనలు, ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాలోని ఇతర ప్రధాన సంఘటనలను బాగా కవర్ చేశాడు. 2021లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని స్పిన్ బోల్డక్‌లో ఆఫ్ఘన్ భద్రతా బలగాలు, తాలిబన్ దళాల మధ్య జరిగిన ఘర్షణను కవర్ చేస్తూ సిద్దిఖీ ప్రాణాలు కోల్పోయారు.
అద్నాన్ అబిది
అద్నాన్ అబిది గతంలో ఫోటోగ్రఫీలో రెండు పులిట్జర్ ప్రైజ్ విజేతల బృందంలో భాగంగా ఉన్నారు. వీటిలో 2020లో హాంకాంగ్ నిరసనలు, 2018లో రోహింగ్యాల వలసలు ఉన్నాయి. 1997లో డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించిన అద్నాన్.. ఫొటో న్యూస్‌కు సంబంధించి పనిచేశారు. తర్వాత 2005లో రాయిటర్స్‌లో చేరారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో ఉన్న అద్నాన్.. రాయిటర్స్ సీనియర్ ఫోటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ అసైన్‌మెంట్‌లను కవర్ చేస్తున్నారు.
సన్నా ఇర్షాద్ మట్టూ
కాశ్మీర్‌కు చెందిన ఈ ఫోటో జర్నలిస్ట్.. డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫ.ర్ సంచలనాత్మక వార్తలు, లోతైన కథనాలను కవర్ చేసారు. ఆమె వర్క్స్ కాశ్మీర్‌లోని పరిస్థితి, ప్రజల జీవితంపై దృష్టి సారిస్తున్నారు. మల్టీమీడియా జర్నలిస్ట్‌గా ప్రస్తుతం రాయిటర్స్‌కు కంట్రిబ్యూట్ చేస్తున్నారు.
అమిత్ డేవ్
అమిత్ 2002లో రాయిటర్స్‌లో చేరారు. గుజరాత్‌లో భూకంపం, అల్లర్లు, కరువులు, దక్షిణ భారతదేశంలో హిందూ మహాసముద్ర సునామీ తర్వాత జరిగిన పరిణామాలను కవర్ చేశారు. మూడు దశాబ్దాల తన కెరీర్‌లో.. అమిత్ పలు మీడియా సంస్థలలో భాగంగా ఉన్నాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్న డేవ్ రాయిటర్స్ కోసం స్థానిక, జాతీయ వార్తలను కవర్ చేస్తున్నారు.
పులిట్జర్ అవార్డులు జాబితా..
ప్రజా సేవ- వాషింగ్టన్ పోస్ట్, 2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడికి సంబంధించిన కవరేజ్
బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్- మియామి హెరాల్డ్ సిబ్బంది, ఫ్లోరిడాలోని సముద్రతీర అపార్ట్‌మెంట్ టవర్లు కూలిపోయిన సంఘటన కవరేజ్
పరిశోధనాత్మక రిపోర్టింగ్- టంపా బే టైమ్స్‌కు చెందిన కోరీ జి. జాన్సన్, రెబెక్కా వూలింగ్‌టన్, ఎలి ముర్రే.. ఫ్లోరిడాలోని ఏకైక బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్‌లోని అత్యంత విషపూరిత ప్రమాదాలను బహిర్గతం చేసినందుకు. వీరి కథనంతో.. ఆ ప్లాంట్‌లోని కార్మికులు, సమీపంలోని నివాసితులను తగినంతగా రక్షించడానికి భద్రతా చర్యలను అమలు చేయవలసి వచ్చింది.
వివరణాత్మక రిపోర్టింగ్- వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఎలా పనిచేస్తుందో నివేదించినందుకు క్వాంటా మ్యాగజైన్ సిబ్బందికి.. ముఖ్యంగా నటాలీ వోల్చోవర్.
స్థానిక రిపోర్టింగ్- బెటర్ గవర్నమెంట్ అసోసియేషన్‌కు చెందిన మాడిసన్ హాప్‌కిన్స్, చికాగో ట్రిబ్యూన్‌కు చెందిన సిసిలియా రెయెస్.. వీరు చికాగోలోని విఫలమైన భవనం, ఫైర్ సేఫ్టీ కోడ్ అమలుపై సుదీర్ఘ చరిత్రను పరిశీలించారు.
నేషనల్ రిపోర్టింగ్- ఒక ప్రాజెక్ట్ కోసం న్యూయార్క్ టైమ్స్ సిబ్బంది ప్రాణాంతకమైన ట్రాఫిక్ స్టాప్‌ల ఆందోళనకరమైన నమూనాను లెక్కించారు.
అంతర్జాతీయ రిపోర్టింగ్- న్యూయార్క్ టైమ్స్ సిబ్బంది.
ఫీచర్ రైటింగ్- ది అట్లాంటిక్‌కి చెందిన జెన్నిఫర్ సీనియర్.. 9/11 దాడుల నుంచి 20 సంవత్సరాలలో ఒక కుటుంబం నష్టానికి సంబంధించిన వివరణ.
వ్యాఖ్యానం- కాన్సాస్ సిటీ స్టార్‌కి చెందిన మెలిండా హెన్నెబెర్గర్
విమర్శ- కళ, జనాదరణ పొందిన సంస్కృతిలో నల్లజాతి కథల గురించి రాసినందుకు సలామిషా టిల్లెట్ విజేతగా నిలిచారు.
సంపాదకీయ రచన- హ్యూస్టన్ క్రానికల్‌కి చెందిన లిసా ఫాల్కెన్‌బర్గ్, మైఖేల్ లిండెన్‌బెర్గర్, జో హోలీ, లూయిస్ కరాస్కో
ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, వ్యాఖ్యానం- ఇన్‌సైడర్‌కి చెందిన ఫహ్మిదా అజీమ్, ఆంథోనీ డెల్ కల్, జోష్ ఆడమ్స్, వాల్ట్ హికీ.
బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ-లాస్ ఏంజిల్స్ టైమ్స్‌కు చెందిన మార్కస్ యామ్. మరో విజేతగా- US క్యాపిటల్‌పై దాడికి సంబంధించిన సమగ్రమైన ఫొటోలకు సంబంధించి.. విన్ మెక్‌నామీ, డ్రూ యాంజెరర్, స్పెన్సర్ ప్లాట్, శామ్యూల్ కోరమ్, జెట్టి ఇమేజెస్‌కు చెందిన జోన్ చెర్రీ
ఫీచర్ ఫోటోగ్రఫీ-భారతదేశంలో కోవిడ్ సమయంలో తీసిన ఫొటోలకు సంబంధించి అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ డేవ్, దివంగత డానిష్ సిద్ధిఖీ.
ఆడియో రిపోర్టింగ్- ఫ్యూచురో మీడియా, PRX సిబ్బంది
సాహిత్యం, నాటకం, సంగీతం విభాగాల్లో విజేతల జాబితా..
ఫిక్షన్- ది నెతన్యాహస్: రచయిత - జాషువా కోహెన్.
నాటకం- ఫ్యాట్ హామ్, జేమ్స్ ఇజామ్స్ ద్వారా
చరిత్ర- నికోలస్ యుస్టేస్, క్యూబా.. కవర్డ్ విత్ నైట్; అడా ఫెర్రర్.. యాన్ అమెరికన్ హిస్టరీ
జీవిత చరిత్ర-మై ఛేజింగ్ టు మై గ్రేవ్
కవిత్వం- సొనెట్స్- డయాన్ స్యూస్
జనరల్ నాన్ ఫిక్షన్- ఇన్విజిబుల్ చైల్డ్: పావర్టీ- ఆండ్రియా ఇలియట్
సంగీతం- రావెన్ చాకన్ రచించిన వాయిస్‌లెస్ మాస్
ఇక, జోసెఫ్ పులిట్జర్ యొక్క వీలునామాలోని నిబంధనల ద్వారా పులిట్జర్ ప్రైజ్‌ను 1917లో స్థాపించబడింది. కొలంబియా విశ్వవిద్యాలయంచే నిర్వహించబడుతుంది. పులిట్జర్ ప్రైజ్ జర్నలిజం రంగంలో అమెరికా అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.