టాయ్ లెట్ లో గురక శబ్ధం.. ఆరాతీస్తే బయటపడ్డ వ్యభిచార ముఠా గుట్టు.. షాకింగ్...

Published : May 10, 2022, 10:22 AM IST
టాయ్ లెట్ లో గురక శబ్ధం.. ఆరాతీస్తే బయటపడ్డ వ్యభిచార ముఠా గుట్టు.. షాకింగ్...

సారాంశం

వ్యభిచారముఠా పోలీసులకు చిక్కకుండా ఉండాలని రకరకాల పన్నాగాలు పన్నుతుంటారు. ఇందులో భాగంగానే బాత్రూం టాయ్ లెట్లో గుట్టుగా సీక్రెట్ రూం ఏర్పాటు చేసి అతితెలివి ప్రదర్శించారు. 

బెంగళూరు : అప్పట్లో రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించిచరిత్రలో చదివే ఉంటాం. సాధారణంగా ఐటీ రైడ్ లకు భయపడి డబ్బును గోడలను సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంకు ల్లోనూ దాచడం చూసుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ లు చూసి ఉంటాం. కానీ,  టాయిలెట్ లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ఓ ముఠా గుట్టు తాజాగా వెలుగు చూసింది.

ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తూ ఉన్నారు.  కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ చోట  వ్య‌భిచారం చేస్తున్న‌ట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంట్లో భాగంగా బాత్రూంను పరిశీలించగా.. ఒక చోట నుంచి గురక శబ్దం వినిపించింది.

శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో పరిశీలించిన ఓ అధికారికి టైల్స్ నుంచి వస్తున్నట్టుగా వినిపించింది.  అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే..  అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన చిన్న గది బయట పడింది. పోలీసులు గది తెరిచి చూడగా అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయటికి చూడడానికి మామూలు ప్రదేశంలాగా కనిపించినా టాయిలెట్ లోపల ఇలా ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా, పనికోసం ఇంటికి వచ్చిన Minor Girlతో Prostitution చేయించిన కేసులో భవానిపురం పోలీసులు ఐదుగురునిందితులను arrest చేశారు. ఈ కేసులో vijayawada చిట్టినగర్ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి,  కబేలా సెంటర్ కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి,  మామిడి ముక్కల మండలం తాడంకి గ్రామానికి చెందిన చలపాటి శ్రీనివాస రావు, గుంటూరు చంద్రమౌళి నగర్ కు చెందిన పోపూరి వెంకట రవికుమార్ లను అరెస్ట్ చేసినట్లు సిఐ మహేంద్ర తెలిపారు. వీరిని రిమాండుకు తరలించారని పోలీసులు చెప్పారు. 

కాగా, మార్చి 25న రొంపిచర్లలో ఇలాంటి ఘటనే జరిగింది.  యువకుడి బెదిరింపులకు భయపడి పలుమార్లు Sexual assaultని ఎదుర్కొన్న ఓ బాలిక చివరకు pregnant అయ్యి.. బిడ్డకు జన్మనిచ్చింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి బంధువుల కథనం ప్రకారం… మండల కేంద్రంలోని ఓ private schoolలో చదువుకుంటూ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని బంధువుల ఇంట్లో ఉంటుంది. ఓ సారి ఇంటికి Current repair లు చేయడానికి వచ్చిన పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లెకు చెందిన రాజేష్(34) బాలిక మీద కన్నేశాడు. అప్పటికే అతడికి పెళ్లయ్యింది. ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. అప్పటినుంచి బాలిక కదలికలను గమనించడం మొదలు పెట్టాడు. ఓరోజు ఒంటరిగా వెడుతున్న బాలిక వెంటపడి బలవంతంగా తీసుకెళ్లి molestation చేశాడు.

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!