ఇక్కడ పాలకపక్షం-అక్కడ ప్రతిపక్షాలు... తెలంగాణలో మాదిరే పుదుచ్చెరిలో తమిళిసై పరిస్థితి

Arun Kumar P   | Asianet News
Published : Apr 17, 2022, 10:29 AM ISTUpdated : Apr 17, 2022, 10:41 AM IST
ఇక్కడ పాలకపక్షం-అక్కడ ప్రతిపక్షాలు... తెలంగాణలో మాదిరే పుదుచ్చెరిలో తమిళిసై పరిస్థితి

సారాంశం

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పుదుచ్చెరిలోనూ ప్రతిపక్ష డిఎంకే, కాంగ్రెస్ పార్టీల నుండి అలాంటి చేదు అనుభవమే ఇంచార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసైకి ఎదురయ్యింది.  

పుదుచ్చెరి: తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తనను గవర్నర్ గానే కాదు కనీసం మహిళగా కూడా గౌరవం ఇవ్వడంలేదని తమిళిసై సౌందరరాజన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని హైదరాబాద్ లో వివిధ అధికారిక కార్యక్రమాలతో పాటు జిల్లాల పర్యటన సమయంలోనూ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ప్రొటోకాల్ పాటించడంలేదని... ఎవ్వరూ తనను కలవకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె ఆరోపిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలోనూ తమిళిసైకి ఎదురయ్యింది.  

ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చెరీకి ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నా తమిళిసై. అయితే తెలంగాణలో ముందస్తు ఉగాది వేడుక నిర్వహించినట్లే పుదుచ్చెరిలోనూ తమిళ సంవత్సరాది 'చిత్తిరై నిలవు' సందర్భంగా ప్రత్యేక విందు ఏర్పాటుచేసారు. ఈ విందుకు పుద్దుచ్చెరి సీఎం రంగస్వామి,  మంత్రులు,  అధికార, ప్రతిపక్షాలకు చెందిన కీలక నాయకులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించారు.  

అయితే తమిళిసై ఏర్పాటుచేసిన విందుకు ప్రతిపక్ష డీఎంకె, కాంగ్రెస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇంచార్జి లెప్టినెంట్ గవర్నర్ గా రాజ్యాంగబద్దమైన హోదాలో వున్న తమిళిసై తన పరిధి దాటి వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ విందుకు హాజరుకాలేదు. పుదుచ్చెరి రాష్ట్రానికి కేంద్రంనుండి నిధులు తేవడానికి సహరించాలని.... ఇలా ఈ ప్రాంత అభివృద్దికి సహకరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. 

ఇక లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై విందుకు సీఎం రంగస్వామి, పలువురు మంత్రులతో పాటు బిజెపి, అన్నాడీఎంకే పార్టీల నాయకులు హాజరయ్యారు. తమిళ సంవత్సరాదిన లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన విందుకు ప్రతిపక్షాలు గైర్హాజరవడాన్ని అధికార పార్టీతో పాటు బిజెపి, అన్నాడీఎంకే తప్పుబడుతోంది. 

ఇదిలావుంటే తెలంగాణలో గవర్నర్ తమిళిసై, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్ వివాదం నడుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అయిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోంది తమిళిసై ఆరోపిస్తున్నారు. ఈ ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె ఫిర్యాదు చేసారు.  

ఇటీవల తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ప్రత్యేక వేడుకలు ఏర్పాటుచేసారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ (kcr) తో పాటు మంత్రులను ఆహ్వానించినా హాజరు కాలేదు. సీఎం, మంత్రులే కాదు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలెవ్వరూ ఈ ఉగాది వేడుకల్లో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతకొంతకాలంగా గవర్నర్ ను దూరంపెడుతూ వస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉగాది వేడుకల్లోని అదే తీరును కొనసాగించింది. 

ఇక ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై భద్రాద్రి పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరవ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి దారి తీసింది.   

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హన్మకొండ జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులెవ్వరూ రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు గ్రేటర్ వరంగల్ మేయర్ హాజరుకాలేదు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు పత్తాలేరు. 
 

 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం