పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్.. వైఫల్యానికి 10 కారణాలివే..

By AN TeluguFirst Published Feb 22, 2021, 12:05 PM IST
Highlights

పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆదివారం తాజాగా రెండు కొత్త రాజీనామాలతో విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయింది. 14 మంది మెజార్టీ ఓట్లు ఉన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. దీంతో విశ్వాస పరీక్షలో  నెగ్గలేకపోయారు. ప్రభుత్వం పడిపోతే ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాష్ట్రపతి పాలనలోకి రాష్ట్రం వెళ్లే అవకాశం ఉంది. 

పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆదివారం తాజాగా రెండు కొత్త రాజీనామాలతో విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయింది. 14 మంది మెజార్టీ ఓట్లు ఉన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. దీంతో విశ్వాస పరీక్షలో  నెగ్గలేకపోయారు. ప్రభుత్వం పడిపోతే ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాష్ట్రపతి పాలనలోకి రాష్ట్రం వెళ్లే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభానికి కారణమైన పది ముఖ్యమైన అంశాలు ఇవి.. 

1
మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మీద ఆరోపణలు మొదటి పాయింట్. తమ ఎమ్మెల్యేలలో ఐకమత్యం ఉన్నప్పటికీ కిరణ్ బేడీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారని, దీనికోసం  "ప్రతిపక్షాలతో కలిసిపోతున్నారని" నారాయణస్వామి ఆరోపించారు. కిరణ్ బేడి తన ప్రభుత్వం వేసే ప్రతీ అడుగునూ అడ్డుకుంటూ, కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల్ని రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించడం. 

2
దీనికి తోడు ఆదివారం పాలకకూటమికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన కె లక్ష్మీనారాయణన్,  డిఎంకె కె వెంకటేశన్ లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ మాట్లాడుతూ పార్టీలో "గుర్తింపు" లభించకపోవడంపై కలత చెందానని నాలుగుసార్లు అన్నారు. తనకు మంత్రి పదవి కానీ, స్పీకర్ పోస్ట్ కానీ, చివరికి పార్టీ చీఫ్‌గా గానీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థి ఎన్‌ఆర్ కాంగ్రెస్, బిజెపి తనను సంప్రదించాయని ఆయన అన్నారు.

3
రెండు రాజీనామాలతో, పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వ బలం 12 కి పడిపోయింది.  ప్రత్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

4
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను, బిజెపి సభ్యులందరినీ విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి అనుమతించవద్దని కాంగ్రెస్ స్పీకర్‌ను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలను మినహాయించినట్లయితే, అధికార కాంగ్రెస్‌కు మెజారిటీ ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఓటు వేయడానికి అనుమతి ఇచ్చింది.

5
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళైసాయి సౌందరాజన్ గురువారం ముఖ్యమంత్రిని పిలిచి, తన ప్రభుత్వానికి ఇకపై మెజారిటీ లేదని ప్రతిపక్షాల వైఖరిని ఉటంకిస్తూ సోమవారం విశ్వాసపరీక్షకు వెళ్లాలని ఆదేశించారు. మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడిని వైదొలిగాక తమిళిసై బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీబాధ్యతలు స్వీకరించిన ఒక్క రోజు తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు. 

6
కాంగ్రెస్ లో సంక్షోభానికి ఎమ్మెల్యేల రాజీనామాలే కారణమని భావిస్తున్నారు. జనవరిలో ఇద్దరు, గతవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. జనవరిలో రాజీనామా చేసిన నాయకులు బీజేపీలు చేరారు. గతవారం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో పయనిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ రెండు రాజీనామాలను అంగీకరించొద్దను అప్పుడే ఎమ్మెల్యేలు తిరిగొస్తారని ముఖ్యమంత్రి పట్టుబట్టారు. అయితే అదిప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 

7
అధికార పార్టీల్లో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపి ప్రణాళికలు వేస్తుందని ముఖ్యమంత్రి ఆరోపించారు.  దీనికి "ఆపరేషన్ కమలా" అని విమర్శకులు విశ్లేషిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 

8
ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో నాలుగు అవకాశాలు కనిపిస్తున్నాయి. బల పరీక్షలో నెగ్గితే నారాయణస్వామి ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆ తరువాత ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పిలుపునివ్వవచ్చు. లేదా ప్రభుత్వం పడిపోతుంది. ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నందున.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఆర్ కాంగ్రెస్‌ను అడగొచ్చు. లేదంటే నాలుగో అవకాశంగా లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి పాలనను విధించవచ్చు.

9
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోని ఈ అంతర్గత కలహాలు చివరికి బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు, మరో మూడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో మేలో ఎన్నికలు జరగనున్నాయి.

10
నారాయణసామి ప్రభుత్వం పడిపోతే, దక్షిణాదిలో కాంగ్రెస్ కు ఉన్న ఒక్క అధికారమూ చేజారిపోతుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని పాలక కూటమిలో బిజెపి భాగం అయ్యే అవకాశం ఉంది. అందులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు - నామినేటెడ్ సభ్యులందరూ మంత్రులు కావచ్చు. కాగా  పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తే పక్కనే ఉన్న తమిళనాడులో కూడా బలపడడానికి సహాయపడుతుందని, కర్ణాటక తరువాత దక్షిణాది ప్రభుత్వాల సంఖ్యను పెంచుకోవచ్చని బిజెపి అంచనా వేస్తోంది. 

click me!